పయనించే సూర్యుడు, జనవరి 4, బచ్చన్నపేట మండల ప్రతినిధి’ నీల పవన్. కొడవటూరు గ్రామ సర్పంచ్ గా నూతనంగా ఎన్నికైన నీల కవిత మురళిని శ్రీ సిద్దేశ్వర స్వామి దేవస్థాన కమిటీ చైర్మన్, సభ్యులు, ఆలయ సిబ్బంది సన్మానించారు. అనంతరం జరిగిన శ్రీ సిద్దేశ్వర స్వామి దేవస్థానం హుండీ లెక్కింపులో రూపాయలు 3,96,730/- ఆదాయం రావడం జరిగింది. కార్యక్రమంలో దేవస్థానం ఈవో వంశి, ఇన్స్పెక్టర్ నల్గొండ నిఖిల్ ప్రధాన అర్చకులు ఓం నమశ్శివాయ, చైర్మన్ మల్లారెడ్డి సభ్యులు నిమ్మ కరుణాకర్ రెడ్డి, రామకృష్ణ, శివ రాములు, రాజయ్య,వెంకటయ్య, గ్రామ సర్పంచ్ నీల కవిత మురళి మరియు గ్రామ కార్యదర్శి రూప అర్చక సిబ్బంది మరియు గ్రామస్తులు పాల్గొన్నారు.
