పయనించే సూర్యుడు జనవరి 4 ఎన్ రజినీకాంత్:- హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం సంక్రాంతి పండుగను పురస్కరించుకుని వంగర గ్రామ పంచాయతీ ఆవరణలో మహిళా సంఘాల ఆధ్వర్యంలో శనివారం మహిళలకు ముగ్గుల పోటీలు ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సర్పంచ్ సృజన రమేష్, ఉపసర్పంచ్ ఓల్లాల రమేష్ హాజరైనారు. ఈ పోటీలలో గ్రామంలోని మహిళలు, యువతులు పెద్ద సంఖ్యలో ఉత్సాహంగా పాల్గొని రంగురంగుల ముగ్గులతో పంచాయతీ ప్రాంగణాన్ని కళాత్మకంగా తీర్చిదిద్దారు. ఈ పోటీలలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విజేతలకు సర్పంచ్ సృజన రమేష్, ఉపసర్పంచ్ ఓల్లాల రమేష్, కార్యదర్శి వినయ్ కిరణ్, ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు శ్రీదేవి, వార్డు సభ్యులు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ సృజన రమేష్ మాట్లాడుతూ ఈ పోటీలు మన సంస్కృతి సంప్రదాయాలను కాపాడుకుంటూ, గ్రామంలో ఐకమత్యాన్ని పెంచుతాయని, సంస్కృతిని నేటి తరానికి పరిచయం చేస్తాయని, గ్రామంలో పండుగ వాతావరణాన్ని నింపేందుకు ఈ కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి వినయ్ కుమార్, వార్డ్ సభ్యులు శ్రీరామోజు మొండయ్య, గజ్జెల రమేష్, బత్తిని రజిత, మారం సతీష్, కాల్వ అంజలి, రామారావు స్వరూప, మిడిదొడ్డి తిరుపతి, గజ్జెల సురేష్, కండె శారద, వేముల సాధన, రఘునాయకుల మహేష్, మహిళా సంఘాల సిఎ లు చెప్యాల కమల, ఏనుక కవిత, మంచాల రజిత, వివో అధ్యక్షులు కడారి మంజుల, నేర్నాల సుమలత, ఆశా కార్యకర్తలు కండె సునీత, గజ్జెల పద్మ,మహిళా సంఘాల సభ్యులు, గ్రామ పెద్దలు, గ్రామస్థులు పాల్గొన్నారు