పయనించే సూర్యుడు న్యూస్ జనవరి 5 అశ్వారావుపేట మండల రిపోర్టర్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా స్థానిక వ్యవసాయ కళాశాలలో నాలుగు రోజులు పాటు జరగబోతున్న విశ్వ విద్యాలయ స్థాయి ఆటల పోటీలను జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అట్టహాసంగా ప్రారంభించారు. కార్యక్రమ ప్రారంబోత్సవం లో గౌరవ అతిధి గా దీన్ అఫ్ స్టూడెంట్స్ అఫైర్స్, డాక్టర్ చల్లా వేణుగోపాల రెడ్డి, యూనివర్సిటీ అబ్జర్వర్ గా డాక్టర్ ఎస్ మధుసూధన రెడ్డి వ్యవహిరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జితేశ్ వి పాటిల్ విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ వ్యవసాయం అనేది చాలా ముఖ్యమైన, శక్తివంతమైన వృత్తి అని, సాంకేతికత సాయంతో వ్యవసాయంలో అతి త్వరలోనే చాలా మార్పులు చోటుచేసుకుంటాయని, సగటు రైతు ఒక ఐఏఎస్ అని, ఐఏఎస్ అంటే ఇండియన్ అగ్రికల్చరల్ సర్వీస్ అని కితాబునిచ్చారు. ఇలాంటి వ్యవసాయానికి సాయం చేసే అవకాశం ఉన్న విశ్వవిద్యాలయ విద్యార్థులు, అధ్యాపకులు చాలా అదృష్టవంతులని పేర్కొన్నారు. ఆటల్లో కేవలం గెలుపోటములే కాక పాల్గొనడం ముఖ్యం అని, ఈ కార్యక్రమాన్ని ఒక పోటీలా మాత్రమే కాకుండా ఒక అభ్యసన లా ఒకరినుంచి ఒకరు నేర్చుకోవాలన్నారు. దీన్ ఆఫ్ స్టూడెంట్ అఫైర్స్ చల్లా వేణుగోపాల రెడ్డి మాట్లాడుతూ ఈ పోటీల వల్ల విద్యార్థుల్లో క్రమ శిక్షణ, ఆత్మవిశ్వాసం మరియు క్రీడా స్ఫూర్తి అలవడుతుందని, విశ్వ విద్యాలయ స్థాయి ని అంతర్జాతీయ స్థాయి కి తీసుకొని వెళ్లాల్సిన బాధ్యత విద్యార్థుల మీద ఉందని పేర్కొన్నారు. మనకి పండగ ముందే వచ్చిందని, ఈ నాలుగు రోజుల పాటు జరగబోయే ఆటల పోటీల నివేదిక ను యూనివర్సిటీ అబ్జర్వర్ డాక్టర్ మధుసూధన రెడ్డి పొందుపరిచారు. ఈ పోటీలకు విశ్వవిద్యాలయం పరిధిలోని 13 కళాశాలల నుండి 467 మంది విద్యార్థులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని అసోసియేట్ డీన్ డాక్టర్ హేమంత కుమార్ మరియు ఆఫీసర్ ఇంచార్జి అఫ్ స్టూడెంట్స్ యాక్టివిటీస్ డాక్టర్ ఎం రామ్ ప్రసాద్ సమన్వయ పరిచారు.