పయనించే సూర్యుడు జనవరి 05 ఐదు ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ డాక్టర్ బీ ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం రూరల్ వన్నెచింతలపూడి గ్రామంలో క్షత్రియ సేవా సమితి ఆధ్వర్యంలో శాసనసభ డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణరాజు కు జరిగిన సన్మాన కార్యక్రమంలో అమలాపురం ఎంపీ హరీష్ బాలయోగి పాల్గొన్నారు. ఎమ్మెల్యేలు దాట్ల సుబ్బరాజు, అయితాబత్తుల ఆనందరావు, కిమ్స్ చైర్మన్ చైతన్యరాజు పాల్గొన్న ఈ కార్యక్రమంలో ఎంపీ మాట్లాడుతూ మన ప్రాంతంలో రఘురామ కృష్ణరాజు ను సన్మానించుకోవడం గౌరవంగా భావిస్తున్నానన్నారు. రాష్ట్రానికి అన్యాయం జరుగుతున్న సమయంలో అప్పటి ఎంపీ గా రఘురామ చేసిన కృషిని గుర్తించారు. ఢిల్లీలో రచ్చబండ కార్యక్రమం నిర్వహించి అప్పటి ముఖ్యమంత్రి జగన్ అరాచకాలను ఎండగట్టారన్నారు. రాష్ట్రం కోసం, ఆంధ్రా ప్రజల కోసం అప్పటి ఎన్డీయే పెద్దల సహకారం కోసం పరితపించేవారని గుర్తు చేశారు. రఘురామ చేసిన కృషిని గుర్తించి డిప్యూటీ స్పీకర్ పదవిని కట్టబెట్టినట్లు ఎంపీ హరీష్ బాలయోగి తెలిపారు.
