పయనించే సూర్యడు జనవరి 05 సూర్యాపేట జిల్లా నడిగూడెం ప్రతినిధి పొలంపల్లి వెంకటేశ్వర్లు నడిగూడెం: గ్రామ ప్రజలకు అండగా నిలబడి పారిశుద్ధ్యం, వీధి దీపాలు, త్రాగునీరు, కోతులు కుక్కల బెడద తదితర సమస్యలను పరిష్కరించి గ్రామాన్ని ఆదర్శంగా నిలపాలని రైతు సంఘం జిల్లా సహాయ కార్యదర్శి బెల్లంకొండ సత్యనారాయణ అన్నారు. మండలంలోని రత్నవరం గ్రామ సర్పంచ్ గా ఎన్నికైన క్లాస్ మెంట్ దాట్ల నాగేశ్వరావు ని ఘనంగా సన్మానించిన బాల్య మిత్రులు ఈ సందర్భంగా బెల్లంకొండ సత్యనారాయణ మాట్లాడుతూ పేద ప్రజలకు అండగా నిలబడి వైద్య సేవలు, విద్యారంగం అభివృద్ధి చేయాలని గ్రామ ప్రజల సమస్యలను పరిష్కరించి గ్రామ ప్రజలకు అందుబాటులో ఉండి జిల్లాలో ఉత్తమ గ్రామ పంచాయతీగా ఎన్నిక కావాలని గ్రామ ప్రజలకు కుటుంబ సభ్యుడిగా గ్రామానికి అందుబాటులో ఉండాలని అన్నారు. ఈ సన్మాన కార్యక్రమంలో ఎలక వెంకట్ రెడ్డి, మండవ వెంకట్ పగడాల భూపాల్ రెడ్డి రాములు, పందిరి శ్రీనివాసరెడ్డి, కొల్లు నరసింహ రావు, టిఆర్ఎస్ మాజీ మండల అధ్యక్షుడు రమణారెడ్డి, కె.వి.ఆర్ తదితరులు పాల్గొన్నారు