
పయనించే సూర్యుడు న్యూస్ పెద్దపల్లి : 05 సుల్తానాబాద్ వికాసం వికలాంగుల పునరావాస కేంద్రంలో ఘనంగా అంతర్జాతీయ అందుల దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా సాఫ్ట్వేర్ ఇంజనీర్ దివ్యాంగుడు ప్రవీణ్ కుమార్ హాజరై కేక్ కట్ చేసి, వికలాంగులకు పండ్లు పంపిణీ చేసి వేడుకలను ప్రారంభించారు. సుద్దాల గ్రామానికి చెందిన విశ్రాంత ఉపాధ్యాయుడు అల్లాడి వెంగళరావు వారి తల్లి సత్తెమ్మ, అత్తమ్మ సత్తెమ్మ జ్ఞాపకార్థం పునరావాస కేంద్రానికి రెండు టేబుల్లు బియ్యం వితరణ చేసి వితరణ చేసి, ఒకరోజు భోజనం కార్యక్రమం ఏర్పాటు చేశారు. స్వయంగా మానసిక వికలాంగులకు భోజనాన్ని వడ్డించారు. మానసిక వికలాంగుల పాఠశాలలో ట్రాన్స్పోర్టేషన్ ప్రాబ్లం ఉందని సెంటర్ నిర్వాహకులు శ్రీనివాస్ తెలుపగా విశ్రాంత ఉపాధ్యాయులు ప్రతినెల 500 రూపాయలు అందించనున్నట్లు ప్రకటించి, మొదటి నెల 500 రూపాయలను నిర్వాహకులకు అందజేశారు. సెంటర్ నిర్వాహకుడు శ్రీనివాస్ కూడా ప్రతినెల 500 రూపాయలు ట్రాన్స్పోర్టేషన్కు అందజేశారు. ఈ సందర్భంగా సామాజిక కార్యకర్త తుమ్మ రాజ్ కుమార్ మాట్లాడుతూ మానసిక వికలాంగులను కన్న తల్లిదండ్రులే మోయలేని పరిస్థితుల్లో, పునరావాస కేంద్రంలోని నిర్వాహకులు వారిని కన్నా బిడ్డలుగా అక్కున చేర్చుకొని సెంటర్ నిర్వహించడం అభినందనీయమని అన్నారు. నేడు అందుల దినోత్సవం సందర్భంగా ఒకరోజు ఈ పునరావాస కేంద్రంలో గడపడం సంతోషకరంగా ఉందని అన్నారు. యువ సంకల్ప ఫౌండేషన్ తరపున పునరావాస కేంద్రానికి అండగా ఉంటామని ప్రకటించారు. పునరావాస కేంద్రానికి రెండు బలాలు వితరణ చేసిన గురువులు యువ సంకల్ప ఫౌండేషన్ తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నామని అన్నారు. మానసిక వికలాంగులతో కలిసి అందుల దినోత్సవం రోజున సహపంక్తి భోజనం చేయడం పూర్వజన్మ సుకృతం అని అన్నారు. మానవతావాదులు పునరావాస కేంద్రానికి ఆర్థిక సహాయం అందించి ట్రాన్స్పోర్టేషన్కు అండగా నిలవాలని పిలుపునిచ్చినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సుల్తానాబాద్ ఎంఈఓ ఆరేపల్లి రాజయ్య, సెంటర్ నిర్వాహకులు శ్రీనివాస్, ఎన్ హెచ్ ఎస్ పాఠశాల కరస్పాండెంట్ అన్నమనేని స్వప్న సంతోష్ రావు, యువ సంకల్ప ఫౌండేషన్ సభ్యులు రమేష్, సెంటర్ సిబ్బంది సరస్వతి, కల్పన తదితరులు ఉన్నారు.

