అధికారులకే ఇరుకుగా ఉన్న పాత పంచాయతీ భవనం

* గత వైసిపి ప్రభుత్వంలో అనఆలోచనతో మధ్యలో నిలిచిన నూతన పంచాయతీభవనం * అధికార టిడిపి పార్టీలో నూతన పంచాయతీ భవన నిర్మాణం పై ఊసే లేదు * ఐక్యత లేని టిడిపి నాయకులు ఆ గ్రామం వైపు మొఖం చాటేస్తున్న ఎమ్మెల్యే

పయనించే సూర్యుడు న్యూస్ జనవరి 06: గోనెగండ్ల రిపోర్టర్ సురేష్ నాయుడు మండల పరిధిలోని గంజిహళ్లి గ్రామంలో మొట్టమొదటిసారిగా నిర్మించిన పంచాయతీ భవనంలోనే పాలన వ్యవస్థ కొనసాగుతుంది. గతంలో పంచాయతీ లో పాలన వ్యవస్థ మొత్తం సర్పంచు, సెక్రెటరీ ఇద్దరే పాలన వ్యవస్థ కొనసాగించేవారు. కానీ 2019 లో వైయస్సార్ పార్టీ అధికారంలోకి వచ్చి, సచివాలయా ఉద్యోగ నియామకాలు చేయడంతో పాత పంచాయతీ భవనాల్లో కూర్చోడానికి ఉద్యోగులకే సరిపోతుందని, నూతన సచివాలయ భవనాల నిర్మాణాలకు శ్రీకారం చుట్టారు. గంజిహళ్లి గ్రామ వైసీపీ అనాలోచితతో సచివాలయ నూతన భవన నిర్మాణానికి వంక పరివాహీక ప్రాంతంలో నిర్మాణం చెప్పడంతో అప్పటి ప్రతిపక్ష, ఇప్పటి అధికారపాక పార్టీ వ్యతిరేకించడంతో నిర్మాణ పనులు మధ్యలో నిలిచిపోయాయి, వైసీపీ అధికారం కోల్పోవడం, 2024లో టిడిపి అధికారంలోకి వచ్చి 18 నెలలు గడుస్తున్న , అధికార టిడిపి నాయకులు కూడా నూతన పంచాయతీ భవన నిర్మించుకోవాలన్నా, ఆలోచనలలో ఎవరు కూడా లేనట్టు కనిపిస్తున్నాయని, పాత పంచాయతీ భవనంలో ఉద్యోగులు కూర్చోవడానికి స్థలం సరిపోతుందని, అవసరాలు పనుల నిమిత్తం వెళ్లిన ప్రజలు, తప్పు చేసిన వాళ్ళు కోర్టు లో నిలుచున్నట్లు, ఎంతసేపైనా నిలుచోనే పనులు చేయించుకునే పరిస్థితి నెలకొందని, ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. టిడిపి 18 నెలల కాలంలో సంక్షేమ పథకాలు, ఒకే ఒక సిసి రోడ్డు నిర్మాణ పనులకే పరిమితమైందని, ఇంతవరకు గ్రామంలో ఎలాంటి అభివృద్ధి పనులకు నోచుకోలేదు. గ్రామంలో డ్రైనేజీలు సిసి రోడ్లు లేక అస్తవ్యస్తంగా మారడంతో నాయకులకు సమస్యలు స్థానిక కాలనీవాసులు ప్రభుత్వంపై మండిపడుతున్నారు. నాయకుల ఐక్యత లోపం వలనే ఎమ్మెల్యే కూడా ఆ గ్రామం వైపు మొఖం చాటేస్తున్నారని, గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇది ఇలాగే జరిగితే సర్పంచ్ ఎన్నికల్లో ఓటమి మూట కట్టుకోవడం ఖాయమని గ్రామములో చర్చించుకుంటున్నట్లు సమాచారం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *