రాష్ట్ర సదస్సును జయప్రదం చేద్దాం ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం, భారత కమ్యూనిస్టు పార్టీ

పయనించే సూర్యుడు జనవరి 6 ఆదోని రూరల్ రిపోర్టర్ గ్రామీణ ప్రాంతాలలో వలసల నివారించేందుకు పార్లమెంటులో వామపక్ష పార్టీలు పోరాట ఫలితంగా 2005 సంవత్సరములో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని, ఆనాటి నుంచి ఈనాటి వరకు వ్యవసాయ కార్మికులకు చాలీచాలని నిధులు కేటాయించి గ్రామాలలో ఉపాధి కల్పించారని అన్నారు. ఈనాడు మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గాంధీ పేరును తొలగించే కుట్రతో విబి- జీ- రామ్ జి బిల్లు ఏర్పాటు చేసి వ్యవసాయ కూలీల కడుపు కొట్టే విధంగా పథకాలను తీసుకొచ్చిందని సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు సుదర్శన్ సిపిఐ మండల కార్యదర్శి కలబావిరాజు ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం నియోజకవర్గ కార్యదర్శి బస్తాపురం గోపాల్ తదితరులు అన్నారు. ఈరోజు ఆదోని మండలం చిన్న హరివాణం గ్రామంలో ఉపాధి హామీ కూలీలతో మమేకమై మోదీ తీసుకొచ్చినటువంటి చట్టాలపై అవగాహన కల్పించడం జరిగింది. ఉపాధి హామీ పథకాన్ని పూర్తిగా పేదలకు దూరం చేసే పని బిజెపి ప్రభుత్వం ప్రారంభించిందని, కేంద్ర ప్రభుత్వం 60 శాతం నిధులు రాష్ట్ర ప్రభుత్వం 40% నిధులు కేటాయించిందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం దగ్గర నిధులు లేవని నిరాకరిస్తే వలస కూలీల పరిస్థితి ఏమిటని కేంద్ర ప్రభుత్వాని సూటిగా ప్రశ్నించారు. కేంద్రంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఉపాధి హామీ చట్టంపై త్రీవమైన దాడి మొదలైంది. పేదలకు పట్టేడన్నం పెట్టే ఉపాధి హామీని ఎలా నిర్విరం చేసి పేదల నోట్లో మట్టి కొట్టాలో మోడీ ప్రభుత్వం కసరత్ ప్రారంభించిందని యూపీఏ ప్రభుత్వంలో తెచ్చిన మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం రద్దుచేసి కొత్త పథకాలు ప్రవేశ పెట్టడం ద్వారా వ్యవసాయ కూలీలకు ఒరిగేది ఏమీ లేదని అన్నారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని యధావిధిగా కొనసాగించాలని కొత్త బిల్లును రద్దు చేయాలని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం భారత కమ్యూనిస్టు పార్టీ ( సిపిఐ) ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఈనెల 10వ తేదీ కర్నూలు జిల్లా పరిషత్ హాల్ నందు జరుగు రాష్ట్ర సదస్సును అధిక సంఖ్యలో గ్రామీణ వ్యవసాయ కూలీలు పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఐ శాఖ కార్యదర్శిలు కరెంటు ఈరన్న, నాగేష్ ఉచ్చప్ప ఈరన్న వ్యవసాయ కూలీలు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *