పయనించే సూర్యుడు న్యూస్ జనవరి 6 అశ్వారావుపేట మండల రిపోర్టర్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రెండవ సాధారణ ఎన్నికలలో భాగంగా అశ్వారావుపేట పురపాలక సంఘ కార్యాలయములో ఎలక్షన్ కమిషన్ ఆదేశానుసారం కమిషనర్ బి. నాగరాజు ఆద్వర్యం లో సోమవారం రాజకీయ పార్టీల నాయకులతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశములో పురపాలక సంఘ ఎన్నికల నిర్వహణ లో భాగంగా ఓటర్ జాబితా, ఎన్నికల పోలింగ్ కేంద్రాలు, వార్డుల వారిగా ఓటర్ల వివరాలను ఆయా పార్టీల నాయకులకు అందు ప్రతులను అందజేసినారు. అనంతారం కమిషనర్ మాట్లాడుతూ ఈ నెల 9 వరకు ఓటర్ జాబితా పోలింగ్ కేంద్రాలపై ఎటువంటి అభ్యంతరాలు ఉన్నా రాతపూర్వకంగా వివరించాలని సూచించారు. ఇందుకు పోలింగ్ స్టేషన్లు మార్చాలని వచ్చిన అభ్యంతరాలపై పరిశీలిస్తామని తెలిపారు. ఈ సమావేశములో రాజకీయ పార్టీల నాయకులు మెట్ట వెంకటేష్, బి. చిరంజీవి, యూఎస్ ప్రకాష్ రావు, బత్తిన పార్ధసారధి, తుమ్మ రాంబాబు, చిన్నం శెట్టి సత్యనారాయణ, బూసి పాండురంగ రావు, నార్లపాటి శ్రీనివాసరావు, డెగల రామచంద్ర రావు, గన్నిన రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.