పయనించే సూర్యుడు, జనవరి 6 2026, నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి ప్రతినిధి నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి నియోజకవర్గం వెల్దండ మండలం చెదురుపల్లి గ్రామంలో పోలే పెద్ద అంజయ్య తండ్రి మొగులయ్య చనిపోవడం జరిగింది. సోమవారం ఉదయం గుండె పోటుతో చనిపోయిన విషయం చెదురుపల్లి గ్రామ ప్రజల ద్వారా తెలుసుకున్న మాజీ ఎంపీపీ వెంకటయ్య గౌడ్ పోలే పెద్ద అంజయ్య కుటుంబాన్ని పరామర్శించి కుటుంబ సభ్యులకు అధైర్య పడకుండా ధైర్యంగా ఉండాలని అన్నారు. రూ.10000/రూపాయలు ఆర్థిక సహాయం అందజేశారు. అదేవిధంగా చెదురుపల్లి గ్రామ సర్పంచ్ వడ్త్యవత్ ధన్సింగ్ నాయక్ తన వంతుగా 3000/ రూపాయలను పోలే పెద్ద అంజయ్య కుటుంబానికి అందజేశారు. అన్ని విధాలుగా కుటుంబాన్ని ఆదుకుంటామని చెప్పారు. ఈ కార్యక్రమంలో వార్డ్ మెంబర్ సభ్యులు, అశోక్, చెదురుపల్లి గ్రామ ప్రజలు పాల్గొన్నారు.