పయనించే సూర్యుడు, జనవరి 6 రంగారెడ్డి జిల్లా ప్రతినిధి (ఎస్ఎంకుమార్) మియాపూర్ డివిజన్ పరిధిలోని స్టాలిన్ నగర్ కాలనీలో అట్టేపల్లి రామ ప్రభు (చై ర్మన్ ఆఫ్ అట్టేపల్లి చారిటబుల్ ట్రస్ట్) ఆధ్వర్యంలో సంక్రాంతి పండగ సందర్భం గా ముగ్గుల పోటీ నిర్వహించి బహుమ తులు అందించారు. మొదటి బహుమతి గా గ్రైండర్, రెండవ బహు మతి రైస్ కుక్కర్, మూడవ బహుమతి డిన్నర్ సెట్, నగదు బహుకరణ.పోటిలో పాల్గొనిన ఆడబిడ్డలందరికీ చీరలు పంపిణీ చేయ డం జరిగింది. ఈ కార్యక్రమంలో స్టాలిన్ నగర్ ఎల్లమ్మ పోచమ్మ ఆలయకమిటీ సభ్యులు భాగ్యమ్మ, విజయ, లతా కాలనీ ఆడబిడ్డల కాలనీ సభ్యులు రాజు, శ్రీను, సంతోష్, సాయిగౌడ్, ప్రసాద్ ఏఆర్ పిటీమ్ సభ్యులు వినీత్, సాయితేజ, అజయ్, సతీష్, కిరణ్, హరినాథ్, సోమే శ్వర్, శివయ్య, ప్రశాంత్, తదితరులు పాల్గొన్నారు. ప్రగతి ఎంక్లెవ్ లో.. నూత న సంవత్సర ఆరంభం,సంక్రాంతి పండుగ శుభ సందర్భంగా ప్రగతి ఎన్‌క్లేవ్ వెల్ఫేర్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు అట్టేపల్లి రామ ప్రభు, కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు అంగరంగ వైభవంగా జరిగాయి తదనంతరం బహు మతులు అందజేశారు. మొదటి బహుమ తిగా గ్రైండర్ రెండో బహుమ తిగా రైస్ కుక్కర్ మూడో బహుమతిగా డిన్నర్ సెట్ బహుకరించారు. కార్యక్రమంలో పాల్గొనిన ఆడబిడ్డలందరికీ బహుమ తులు అందించారు. ఈ కార్యక్రమంలో కాలనీ మహిళలు, పిల్లలు కాలనీ పెద్దలు పాల్గొన్నారు. ముఖ్యఅతిథిగా ప్రముఖ నాయకులు మువ్వ సత్యనారాయణ, సమ్మెట ప్రసాద్, డి ఎస్ ఆర్ కె ప్రసాద్, అన్వర్ షరీఫ్ ,అట్టేపల్లి పురుషోత్తం, లీలా ప్రసాద్, అసోసియేషన్ సభ్యులు దయాకర్ ఖాజా, స్వామి, వినీత్ చంద్ర హాస్, సుమన్, రాములు, వాణి, ప్రసాద్ రామ ప్రభు టీమ్ సభ్యులు సాయితేజ, కిరణ్, అజయ్ సతీష్, వీర రమేష్, యాకయ్య, నగేష్, శ్రవణ్, సోమేశ్వర్, ప్రవీణ్, ప్రశాంత్, హరినాథ్, సతీష్, వరుణ్ తదితరులు పాల్గొన్నారు.
