పయనించే సూర్యుడు, జనవరి 6 రంగారెడ్డి జిల్లా ప్రతినిధి (ఎస్ఎంకుమార్) మియాపూర్ లో బైక్ చోరీలకు పాల్పడు తున్న ముఠాను అరెస్ట్ చేసిన మియాపూ ర్ స్టేషన్ పోలీసులు నిందితుల వద్ద నుండి 80 లక్షల రూపాయలు విలు వచేసే 24 ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నారు. కెటిఎం రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ లే నిందితుల టార్గెట్ మొత్తం నలుగు రు ఒక ముఠాగా ఏర్పడి బైక్ చోరీకు పాల్పడుతున్న నిందితులు. నిందితుల్లో ఇద్దరినీ అరెస్టు చేసిన మియాపూర్ పోలీ సులుసాయి కిరణ్(23) లీలా సాయి(21) ను అదుపులోకి తీసుకున్నారు మియా పూర్ పోలీసులు విజయ శివ సాయి ప్రసాద్(25) ప్రస్తుతం అనకాపల్లిలోని పోలీసులు అదుపులో గడ్డం ప్రవీణ్ (25) పరారీలో ఉన్నాడు నలుగురు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంకి చెందినవారు. నిందితుల పై పలు పోలీస్ స్టేషన్లలో బైక్ చోరి కేసులు నమోదు అయ్యాయని మిడియా సమావేశంలో మియాపూర్ ఏసిపి శ్రీనివాస్ కుమార్ తెలిపారు. ఈ కేసు లో భాగస్వా ములైన పోలీసు సిబ్బంది ప్రేమ్ కుమార్ హెచ్, యాదయ్య హెచ్ సి, పూర్ణచందర్ పీసీ, చంద్ర బోస్ పీసీ, మల్లికార్జున పీసీ, రు శేశ్వర్ పీసీ,కీర్తీ కుమార్ హెచ్సి, చంద్రశేఖర్ హెచ్ సి, స్వప్న డబ్లుపిసిలను ఏ సి పి శ్రీనివాస్ కుమార్ అభినందించారు.