పయనించే సూర్యుడు న్యూస్:- పెద్దపల్లి జిల్లా, సెంటినరీ కాలనీ-06:- రామగుండం-3 ఏరియా జనరల్ మేనేజర్ గా విధులు నిర్వహించి, డిసెంబర్-31న ఉద్యోగ విరమణ పొందిన నరేంద్ర సుధాకరరావు కు సోమవారం జిఎం కార్యాలయం నందు రామగుండం-3, అడ్రియాల ప్రాజెక్ట్ ఏరియా జనరల్ మేనేజర్ కొలిపాక నాగేశ్వరరావు ఉద్యోగ విరమణ పొందినవారికి సింగరేణి సంస్థ సి పి ఆర్ ఎం ఎస్ (కాంట్రిబ్యూటరీ పోస్ట్ రిటైర్మెంట్ మెడికల్ స్కీం) క్రింద ఇచ్చే మెడికల్ కార్డును అందజేశారు. ఈ కార్యక్రమంలో పర్సనల్ విభాగధిపతి బి.సుదర్శనం పాల్గొన్నారు.