
పయనించే సూర్యుడు జనవరి 6 ఎన్ రజినీకాంత్:- హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం కొత్తకొండ శ్రీ వీరభద్రస్వామి బ్రహ్మోత్సవాలలో భాగంగా జరిగే జాతర పనులను సోమవారం హనుమకొండ జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ పరిశీలించారు.. ఈ సందర్భంగా వివిధ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించిన కలెక్టర్, జాతరలో భక్తులకు అసౌకర్యం కలగకుండా, అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.. అనంతరం వరంగల్ జిల్లా దేవాదాయ శాఖ సహాయ కమిషనర్ రామాల సునీత దేవాలయం తరఫున చేయబోయే ఏర్పాట్ల గురించి కలెక్టర్ స్నేహ శబరిష్ కు వివరించారు.. భక్తులకు ఇబ్బందులు కలగకుండా కొత్తకొండ గ్రామానికి వచ్చే మార్గాలలో గుంతలు పూడ్చివేత, పార్కింగ్ స్థలాల ఏర్పాటుపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నామని పేర్కొన్నారు.. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ స్నేహ శబరిష్, వరంగల్ దేవాదాయశాఖ సహాయ కమిషనర్ రామాల సునీత, ఎంపీడీవో వీరేశం, ఎంపీఓ నాగరాజు, ఎమ్మార్వో రాజేష్, ముల్కనూర్ ఎస్సై రాజు, కొత్తకొండ గ్రామ సర్పంచ్ రమా రమేష్, మెడికల్ ఆఫీసర్ జ్యోతి, ఫైర్ అధికారి సుదర్శన్ రెడ్డి, ఆలయ ఉప ప్రధాన అర్చకులు రాజయ్య, సిబ్బంది రవీందర్, అర్చకులు రవి శర్మ, శ్రీధర్, తదితరులు పాల్గొన్నారు..
