పయనించే సూర్యుడు రీపోట్టర్ జల్లి నరేష్ చింతూరు డివిజన్ ఇంచార్జి జనవరి 6 పోలవరం జిల్లా ఎటపాక మండల పరిషత్ కార్యాలయం ఎటపాక లో జరిగిన ఆటమండల మహాసభలో నూతన కమిటీని ఎన్నుకోవడం జరిగింది. సభకు ముందు శ్రీ కనితి శేఖర్ రాష్ట్ర ఉపాధ్యక్షులు మరియు తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కల్లూరి జయ బాబు నాయకుల సమక్షంలో జండా ఆవిష్కరించి సభ ను ప్రారంభించారు. సభలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు మాట్లాడుతూ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదివాసీలకు ఇచ్చిన మాట ప్రకారం ఏజెన్సీ ప్రాంత ఉద్యోగ నియామక చట్టం చేయాలని డిమాండ్ చేశారు. అలాగే ఎస్టీ రిజర్వేషన్లు లో అడా కాశీ విధానాన్ని రద్దు చేయాలని కోరారు. ఈ సభలో జిల్లా నాయకుల సమక్షంలో అధ్యక్ష కాకా. రాజు, ప్రధాన కార్యదర్శి అపక నాగేశ్వరావు మరియు ఇతర శాఖలను ఏకగ్రీవంగా ఎన్నుకొని ఆమోదించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎంఈఓ 2 సరియం రాజులు , రాష్ట్ర మహిళా విభాగం కార్యదర్శి రామలక్ష్మి ,రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ కనితి రామకృష్ణ, పూరి కిరణ్, జిల్లా నాయకులు కట్టం వీరయ్య ,ప్రవీణ్ ,ప్రసాద్ , నాగేశ్వరరావుశ్రీశైలం మండలంలో ఆట సభ్యులుపాల్గొన్నారు.