పయనించే సూర్యుడు రీపోట్టర్ జల్లి నరేష్ డివిజన్ ఇంచార్జ్ జనవరి 6 పోలవరం జిల్లా చింతూరు మండలం లో గంజాయి పెంచడం, సేవించడం, వ్యాపారం చేయడం, వ్యాపారం చేసే వారికి సహకరించడం నేరమని, అలా చేసిన వారికి శిక్ష తప్పదని చింతూరు సిఐ గోపాలకృష్ణ, ఎస్సై రమేష్ పేర్కొన్నారు.వారి ఆధ్వర్యంలో గంజాయి పై అవగాహన సదస్సును, రత్నాపురం గ్రామంలో సోమవారం నిర్వహించారు. అంతేగాక గ్రామస్తులతో స్త్రీలపై జరుగుతున్న లైంగిక దోపిడి, అన్యాయాలు, గూర్చి ఏమన్నా ఉంటే వెంటనే తమకు తెలపాలని కోరారు. అలాగే సైబర్ నేరాల గురించి, రోడ్డు భద్రత గురించి అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో రత్నాపురం గ్రామస్తులు పాల్గొన్నారు.