
పయనించే సూర్యుడు పెనుగంచిప్రోలు మండలం రిపోర్టర్ ఆరుద్ర రమేష్ ఎన్టీఆర్ జీల్లా జగ్గయ్యపేట నియోజకవర్గం జనవరి 7 పెనుగంచిప్రోలు మండలం, పెనుగంచిప్రోలు గ్రామంలో కొలువై ఉన్న ప్రసిద్ధ దైవక్షేత్రమైన శ్రీ గోపయ్య సమేత శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ అమ్మవారు ఈరోజు రంగులు మహోత్సవం సందర్భంగా పెనుగంచిప్రోలు గ్రామం నుండి జగ్గయ్యపేట పట్టణానికి ఊరేగింపుగా బయలుదేరి వెళ్తున్న ఉత్సవ విగ్రహాల ఎడ్లబండ్లకు కొబ్బరికాయలు కొట్టి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన విజయవాడ పార్లమెంట్ సభ్యులు ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) , జగ్గయ్యపేట శాసనసభ్యులు శ్రీరాం రాజగోపాల్ (తాతయ్య) నియోజకవర్గ ప్రజలంతా సుఖసంతోషాలతో, ఆరోగ్య ఐశ్వర్యాలతో వర్ధిల్లాలని ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, ప్రజాప్రతినిధులు, స్థానిక నాయకులు, గ్రామ పెద్దలు మరియు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందారు. భక్తుల నినాదాలతో, మంగళ వాయిద్యాల మధ్య రంగులు మహోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు, భక్తులు, పెద్ద సంఖ్యలో పాల్గొని రంగులు మహోత్సవాన్ని మరింత వైభవంగా జరిపారు.
