రంగుల మహోత్సవ శుభసందర్భంలో జగ్గయ్యపేటకు పావనంగా విచ్చేసిన జగన్మాత శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ అమ్మవారికి భక్తిపూర్వక స్వాగతం పలికిన శాసనసభ్యులు శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య

పయనించే సూర్యుడు రిపోర్టర్ జగయ్యపేట నియోజకవర్గం ఇన్చార్జి చేని రాంబాబు ఎన్టీఆర్ జీల్లా జగయ్యపేట నియోజకవర్గం జనవరి 7 జగయ్యపేట పట్టణంలోని ఈరోజు న రంగుల మహోత్సవమనే మహానుభావ క్షణంలో జగ్గయ్యపేట పట్టణాన్ని పుణ్యధామంగా మార్చుతూ విచ్చేసిన కరుణాసాగరి, సర్వలోక జననీ జగన్మాత శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ అమ్మవారిని దర్శించుకోవడం అపూర్వ సౌభాగ్యంగా భావించిన శాసనసభ్యులు శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య అమ్మవారి పాదపద్మాలకు శిరసు వంచి భక్తిపూర్వకంగా ఘన స్వాగతం పలికారు. ఈ పవిత్ర ఘడియల్లో వేదమంత్రోచ్చారణల నడుమ, అగ్నిహోత్ర సుగంధ ధూపదీప నైవేద్యాలతో అమ్మవారి ప్రతిమకు విశేష పూజలు, అర్చనలు నిర్వహించి, జగన్మాత కటాక్షంతో ప్రజలకు ఐశ్వర్యం, ఆరోగ్యం, సుఖశాంతులు సిద్ధించాలని హృదయపూర్వకంగా ప్రార్థించారు. అమ్మవారి దివ్య అనుగ్రహంతో జగ్గయ్యపేట పట్టణం సర్వకాల సుభిక్షంగా, ధర్మమార్గంలో వెలుగొందాలని సంకల్పించారు. ఈ మహోత్సవంలో భక్తజనసమూహం అమ్మవారి నామస్మరణతో పరిసరాలను దివ్యమయంగా తీర్చిదిద్దగా, ఆలయ వాతావరణం భక్తిరసంతో పరిపూర్ణమైంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *