పయనించే సూర్యుడు న్యూస్ జనవరి 7 పలాస నియోజకవర్గం ప్రతినిధి రత్నాల రమేష్. కేసులు పరిష్కారానికి మద్య వర్తిత్వం చాలా అవసరమని మండల్ లీగల్ సెల్ సర్వీస్ అథారిటీ చైర్మన్, జూనియర్ సివిల్ జడ్జ్ యూ.మాధురి తెలిపారు.ఇటీవల మీడియేషన్ అడ్వకేట్స్ గా సుప్రీంకోర్టుకు చెందిన ప్రత్యేక ప్రతినిధుల ద్వారా శిక్షణ పొందిన పలాస బార్ అసోసియేషన్ జాయింట్ సెక్రెటరీ జిఎంఎస్.అనిల్ రాజుకు ఏపీ లీగల్ సెల్ సర్వీస్ అథారిటీ, అమరావతి జారీచేసిన సర్టిఫికెట్ ను పలాస జూనియర్ సివిల్ జడ్జి యూ మాధురి అందజేశారు ఈ సందర్భంగా జూనియర్ సివిల్ జడ్జి మాట్లాడుతూ కుటుంబ పరమైన కేసులు, ఆస్తి తగాదాలు, చెక్ బౌన్స్, మనీ సూట్స్ తదితర కేసులు మధ్య వర్తిత్వం ద్వారా పరిష్కరించుకోవాలని ఆమె సూచించారు ఈ సందర్భంగా అనిల్ రాజును అభినందించారు