పయనించే సూర్యుడు జనవరి 7 నాగర్ కర్నూల్ జిల్లా బిజినపల్లి రిపోర్టర్ కే శ్రావణ్ కుమార్ నాగర్‌కర్నూల్ జిల్లా బిజినపల్లి మండలం గుడ్లనర్వ గ్రామ శివారులో ఉన్న శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయానికి సంబంధించిన మాన్యం భూమిలో అనుమతులు లేకుండా అక్రమంగా మొరం రోడ్డును నిర్మించిన ఘటనపై గ్రామస్థుడు శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయ కమిటీ మెంబర్ మాజీ ఎంపీటీసీ లేట్ల రాములు మండల తహసీల్దార్ కి వినతిపత్రం అందజేశారు. గ్రామం ముందు భాగంలో ఉన్న సుమారు హెక్టార్లు 02-00 విస్తీర్ణం గల దేవాదాయ మాన్యం భూమిలో, మల్లేపల్లి రామ్ రెడ్డి (తండ్రి: మల్లేపల్లి కొండారెడ్డి), గుడ్లనర్వ గ్రామానికి చెందిన వారు దేవాదాయ ధర్మాదాయ శాఖ అనుమతి లేకుండా సుమారు 15 ఫీట్ల వెడల్పుతో మొరం రోడ్డును నిర్మించారని వినతిపత్రంలో పేర్కొన్నారు. ఈ అక్రమ నిర్మాణం వల్ల శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయానికి చెందిన మాన్యం భూమికి నష్టం కలుగుతోందని, భవిష్యత్తులో మరిన్ని అక్రమాలు జరిగే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. సంబంధిత వ్యక్తులపై శాఖాపరమైన మరియు చట్టపరమైన చర్యలు తీసుకొని దేవాలయ ఆస్తిని పరిరక్షించాలని తహసీల్దార్‌ను కోరారు. ఇదే విషయమై దేవాదాయ ధర్మాదాయ శాఖ సహాయ కమిషనర్, మహబూబ్‌నగర్ అధికారికి కూడా ఫిర్యాదు చేసినట్లు లేట్ల రాములు లేట్ల ఉదయ్ కుమార్ తెలిపారు.