యడ్లపాడు మండల వైసీపీ శ్రేణులకు దిశానిర్దేశం – చైతన్యంతో ముందుకు సాగాలి

పయనించే సూర్యుడు న్యూస్ జనవరి 7 యడ్లపాడు మండల ప్రతినిధి యడ్లపాడు మండలంలోని అన్ని గ్రామాల వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు మరింత చురుకుగా, క్రమశిక్షణతో, ప్రజల మధ్య నిలబడి పనిచేయాల్సిన అవసరం ఉందని పార్టీ పిలుపునిస్తోంది. పార్టీ అంటే పదవులు కాదు – ప్రజల సమస్యలపై పోరాటం, ప్రజలతో అనుబంధం, పార్టీ సిద్ధాంతాలపై అంకితభావం అని గుర్తుంచుకోవాలి. ఈ సందర్భంగా యడ్లపాడు మండల వైసీపీ పార్టీ అధ్యక్షులు వడ్డేపల్లి నరసింహారావు మాట్లాడుతూ ప్రతి కార్యకర్త గ్రామస్థాయిలో పార్టీకి బలంగా నిలవాలని, ప్రభుత్వం ప్రజలకు చేస్తున్న అన్యాయాలను ధైర్యంగా ప్రశ్నించాలని, సోషల్ మీడియా నుంచి గ్రామ వీధుల వరకు పార్టీ గొంతుక వినిపించాలని సూచించారు. అలాగే సీనియర్ నాయకులు రాచమంటి చింతరావు మాట్లాడుతూ పార్టీ ఇచ్చిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తూ, కొత్త కార్యకర్తలను ప్రోత్సహిస్తూ, యువత–మహిళలను పార్టీలో చురుగ్గా భాగస్వాములను చేయాలని పిలుపునిచ్చారు. క్రియాశీలక కార్యకర్త లక్ష్యం: ప్రజల సమస్యలపై నిరంతరం పోరాటం పార్టీ కార్యక్రమాల్లో ముందుండి పాల్గొనడం నాయకత్వంపై నమ్మకం, ఐక్యత సోషల్ మీడియా ద్వారా పార్టీ బలాన్ని పెంచడO

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *