పయనించే సూర్యుడు గాంధారి 07/01/26 మండల కేంద్రంలోని భవిత ప్రత్యేక పాఠశాలల్లో ఈరోజు దివ్యాంగులైన విద్యార్థినీ విద్యార్థులకు నరాల బలహీనత తో బాధపడుతున్న పిల్లలకు డాక్టర్ స్వాతి వైద్య పరీక్షలు నిర్వహించారు. వారు వారానికి రెండు ఫిజియోథెరపీ క్యాంపులను తప్పనిసరిగా వినియోగించుకోవాలని అలాగే ప్రతిరోజు ఉదయం సాయంత్రం తల్లిదండ్రులు వారికి సాధారణమైన వ్యాయామాలు చేయించాలని ఆమె సూచించారు. ఈ కార్యక్రమంలో ఎనిమిది మంది దివ్యాంగులు పాల్గొన్నారు. ఈ ఫిజియోథెరఫీ క్యాంపులను పరిసర గ్రామాల దివ్యాంగులు వినియోగించుకోవాలని ప్రత్యేక ఉపాధ్యాయుడు పెంటయ్య, రిసోర్స్ టీచర్ సాయన్నలు తెలిపారు.