పయనించే సూర్యడు / జనవరి 07/ కాప్రా ప్రతినిధి సింగం రాజు కాప్రా సర్కిల్ నూతన డిప్యూటీ కమిషనర్ కే. శ్రీహరి బాధ్యతలు చేపట్టిన సందర్భంగా డాక్టర్ ఏ.ఎస్. రావు నగర్ డివిజన్ కాంగ్రెస్ నాయకులు శుభాకాంక్షలు తెలిపారు. ఉప్పల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ మందముల పరమేశ్వర రెడ్డి ఆదేశాల మేరకు ఏ ఎస్ రావు నగర్ డివిజన్ ప్రధాన కార్యదర్శి సుంకు శ్రీకాంత్ రెడ్డి, సీనియర్ నాయకుడు అజీజ్ కాప్రా మున్సిపల్ కార్యాలయంలో డిప్యూటీ కమిషనర్‌ను కలిశారు. ఈ సందర్భంగా డివిజన్ పరిధిలోని పౌర సమస్యల పరిష్కారానికి సమన్వయంతో పనిచేయాలని నాయకులు సూచించారు. నూతన డిప్యూటీ కమిషనర్ బాధ్యతల స్వీకరణతో కాప్రా సర్కిల్ పరిధిలో అభివృద్ధి కార్యక్రమాలు వేగవంతం అవుతాయని, ప్రజలకు మెరుగైన సేవలు అందుతాయని వారు ఆశాభావం వ్యక్తం చేశారు.