తాళ్లూరులో రైతులకు రాజముద్రతో కూడిన పాస్ పుస్తకాల పంపిణీ

* రైతు సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యం ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ

పయనించే సూర్యుడు జనవరి : 7 జగ్గంపేట నియోజకవర్గ ఇంచార్జి కె సాయి దుర్గ కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గం రైతుల సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని జగ్గంపేట శాసనసభ్యుడు జ్యోతుల నెహ్రూ అన్నారు. మంగళవారం గండేపల్లి మండలం తాళ్లూరు గ్రామంలో రైతులకు రాజముద్రతో కూడిన ‘మాభూమి – మాహక్కు’ నూతన పాస్ పుస్తకాలను పంపిణీ చేశారు.సర్పంచ్ శిలామంతుల వీరబాబు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, గత ప్రభుత్వం చేసిన తప్పిదాలను సరిదిద్దుతూ నూతనంగా పాస్ పుస్తకాలను రైతులకు అందజేస్తున్నట్లు తెలిపారు. రైతుల కోసం ప్రభుత్వం చిత్తశుద్ధితో పని చేస్తోందన్నారు.గత ప్రభుత్వంలో పాస్ పుస్తకాలపై రాజకీయ ప్రచారానికి ప్రాధాన్యం ఇచ్చారని విమర్శించారు. ప్రస్తుతం రైతులకు అవసరమైన అన్ని అంశాలను పాస్ పుస్తకాల్లో ముద్రించి ప్రయోజనం చేకూర్చే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు. ఈ సందర్భంగా తాళ్లూరు గ్రామానికి చెందిన పలువురు రైతులు తమ భూములు పాస్ పుస్తకాలలో పూర్తిగా నమోదు కాలేదని ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. వెంటనే అధికారులను ప్రశ్నించిన ఎమ్మెల్యే, ఈ గ్రామంలో ఇంకా రీ-సర్వే పూర్తి కాలేదని తెలిపారు. రీ-సర్వే పూర్తిచేసి రైతుల భూములు పూర్తిగా నమోదు చేసిన నూతన పాస్ పుస్తకాలను పంపిణీ చేయాలని, తప్పులు ఉన్న పాస్ పుస్తకాలను సరిచేసి మళ్లీ అందజేయాలని అధికారులను ఆదేశించారు.ఈ కార్యక్రమంలో ఎస్వీఎస్ అప్పలరాజు, రాష్ట్ర కమ్మ కార్పొరేషన్ డైరెక్టర్ పోతుల మోహన్ రావు, కుంచే రాజా, అడబాల భాస్కర రావు, సర్పంచ్ ఎస్ వీరబాబు, సొసైటీ చైర్మన్లు కంటిపూడి సత్యనారాయణ, దిడ్డి చిన్న శ్రీను, యర్రంశెట్టి బాబ్జి, దాపర్తి సీతారామయ్య, మార్కెట్ కమిటీ డైరెక్టర్ సుంకవిల్లి రాజు, ఆత్మ కమిటీ డైరెక్టర్ ఇజ్జిన రాంబాబు, అడబాల ఆంజనేయులు, పాలచర్ల సత్యనారాయణ, పి. వెంకటేశ్వరరావు, కోండ్రు అప్పలరాజు, మద్దిపాటి రాంబాబు, ముండ్రు వాసు తదితరులు పాల్గొన్నారు. అధిక సంఖ్యలో రైతులు హాజరయ్యారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *