పయనించే సూర్యుడు న్యూస్ 07 జనవరి ఇబ్రహీంపట్నం నియోజకవర్గం ఇంచార్జ్ రిపోర్ట్ మొలుగు సంజీవ : యాచారం మండల పరిధి మేడిపల్లి గ్రామంలో గ్రామీణ వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో రైతులకు అవగాహన సందస్సు నిర్వహించారు. ఇందులో భాగంగా మేడిపల్లి గ్రామ సర్పంచ్ సుగుణ సంపత్ మాట్లాడుతూ రసాణాలతో పండించిన ఆహారం తిని అనారోగ్యం బారిన పడుతున్నామని, ఆరోగ్యం కాపాడుకునే దశలో రైతులంతా అధికారుల సూచనలు పాటించాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అధికారులు, గ్రామ రైతులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు