విద్యార్థుల జీవితాలతో చెలగాట మాడుతున్న శ్రీ వెంకటేశ్వర ఒకేషనల్ జూనియర్ కళాశాల

* యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని ఎమ్మార్వో ఆఫీస్ లో వినతి పత్రం ఇవ్వడం జరిగింది

పయనించే సూర్యుడు జనవరి 8( ప్రతినిధి గుమ్మకొండ సుధాకర్ డిండి మండలం నల్లగొండ జిల్లా) డిండి మండల కేంద్రంలోని విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్న శ్రీ వెంకటేశ్వర ఒకేషనల్ జూనియర్ కళాశాల యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని డిండి ఎమ్మార్వో కార్యాలయంలో ఆర్ ఐ కి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఏఐఎస్ఎఫ్ అఖిల భారత విద్యార్థి సమాఖ్య ( ఏఐఎస్ఎఫ్ ) డిండి మండల సమితి ఆధ్వర్యంలో ఎమ్మార్వో కార్యాలయం ముందు నిరసన తెలియజేయడం జరిగింది ఈ కార్యక్రమానికి దేవరకొండ డివిజన్ అధ్యక్షుడు సురిగి వినయ్ కుమార్ అధ్యక్షత వహించడం జరిగింది ఈ ఒక నిరసన కార్యక్రమానికి అనంతరం ముఖ్య అతిథిగా విచ్చేసిన అఖిల భారత విద్యార్థి సమాఖ్య (ఏఐఎస్ఎఫ్) తెలంగాణ రాష్ట్ర నాయకులు బలముల ప్రేమ్ కుమార్ మాట్లాడుతూ.. డిండి మండల కేంద్రంలో శ్రీ వెంకటేశ్వర జూనియర్ ఒకేషనల్ కళాశాల విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతుందని, గత సంవత్సరం నుంచి ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ సంబంధించిన విద్యార్థులకు ఫీజురీమెన్స్మెంట్, స్కాలర్షిప్ రాలేదని ఒక్కొక్క విద్యార్థితో పదివేలు వసూలు చేయాలని విద్యార్థులకు చెప్పడం జరిగింది విద్యార్థులు డబ్బులు చెల్లించలేదని కళాశాల గేటు బంద్ చేసి విద్యార్థులను కళాశాల లోపలికి వెళ్లకుండా తన ఇష్టం సారంగా విద్యార్థుల పట్ల దురుసుగా ప్రవర్తిస్తున్న కళాశాల యాజమాన్యం మహిళా విద్యార్థుల పట్ల తన ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్న కళాశాల ప్రిన్సిపాల్ చర్యలు తీసుకోవాలని అనేకసార్లు ఏఐఎస్ఎఫ్ కళాశాల ఎదుట ధర్నాలు నిర్వహించిన అదే ధోరణిలో కళాశాల యాజమాన్యం వెళ్లడం జరుగుతుందని వెంటనే హ కళాశాల యాజమాన్యం పైన చర్యలు తీసుకోని ఒక నెల రోజుల్లోపు ఇంటర్ బోర్డు ఎగ్జామ్స్ ఉన్నందున ఇదే సరైన సమయమని విద్యార్థుల వద్ద ఫీజుల దోపిడీకి పాల్పడుతూ వారిపై కక్ష సాధింపు చర్యలు చేస్తున్న యాజమాన్యం ఎక్కడ పరీక్షల్లో ఫెయిల్ అయితాము అని విద్యార్థులు తీవ్ర మనోవేదనకు గురవుతున్నారని కావున వెంటనే కళాశాల తెరిచి విద్యార్థులకు పాఠాలు బోధించాలని విద్యార్థులకు ఎలాంటి ఆటంకాలు లేకుండా సౌకర్యాలు కల్పించాలని లేనిపక్షంలో ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమం ఉధృతం చేస్తామని హెచ్చరించారు కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థి నాయకులు పార్వతి అంజలి సోనీ పూజ అనిత పూజమాని మానస సంధ్య ప్రశాన షాంపత్ సందీప్ మరియు తదితరులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *