రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరి బాధ్యత అవసరం

* మెదక్ డీఎస్పీ ప్రసన్న కుమార్

పయనించే సూర్యుడు జనవరి 8 పెద్ద శంకరంపేట మండలం మెదక్ జిల్లా (రిపోర్టర్ జిన్నా అశోక్) రోడ్డు ప్రమాదాల నివారణకు వాహనదారులు పాదచారులు సహా ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని మెదక్ డీఎస్పీ ప్రసన్న కుమార్ అన్నారు 37వ జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాల్లో భాగంగా 7వ రోజు శంకరంపేట ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో బుధవారం నిర్వహించిన రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు ఈ కార్యక్రమంలో మెదక్ ఏఎంవీఐ శ్రీనివాస్ అల్లాదుర్గం సీఐ రేణుక రెడ్డి శంకరంపేట (ఏ) ఎస్‌ఐ ప్రవీణ్ కుమార్ పాల్గొన్నారు ఆర్‌ఈ–ఎంఎస్‌వీ రహమాన్ ఖాన్ అతిథి గా హాజరయ్యారు డీఎస్పీ ప్రసన్న కుమార్ మాట్లాడుతు ట్రాఫిక్ నియమాలను నిర్లక్ష్యం చేయడమే అధిక సంఖ్యలో రోడ్డు ప్రమాదాలకు కారణమవుతుందన్నారు ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని వాహనదారులు సీటుబెల్ట్ వినియోగించాలని సూచించారు మద్యం సేవించి వాహనం నడపడం అధిక వేగంతో ప్రయాణించడం మొబైల్ ఫోన్ వినియోగం ప్రాణాలకు ముప్పుగా మారుతున్నాయని హెచ్చరించారు విద్యార్థులు చిన్న వయస్సు నుంచే రోడ్డు భద్రతపై అవగాహన పెంపొందించుకోవాలని ట్రాఫిక్ సంకేతాలు రోడ్డు సూచికలను గుర్తించి పాటించాలని తెలిపారు ఈ సందర్భంగా పాల్గొన్నవారితో రోడ్డు భద్రత ప్రతిజ్ఞ చేయించారు ఈ అవగాహన కార్యక్రమం రహదారి వినియోగదారుల్లో భద్రతా చర్యలను బలోపేతం చేయడం లక్ష్యంగా నిర్వహించబడింది కార్యక్రమం శంకరంపేట ఏం ఈ ఓ వెంకటేశం నేషనల్ హైవే అథారిటీ అధికారులు శ్రీ ప్రభాకర్ రెడ్డి మెయింటెనెన్స్ మేనేజర్ శ్రీ అక్షయ్ కుమార్ సేఫ్టీ మేనేజర్ బాలరాజు ఐఎంఎస్ మేనేజర్ మొయినుద్దీన్ పోలీస్ సిబ్బంది విద్యార్థిని విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *