
పయనించే సూర్యుడు ప్రతినిధి ప్రత్తిపాడు నియోజవర్గం ఇంచార్జ్ ఎం. రాజశేఖర్,జనవరి, 8:- ప్రత్తిపాడు నియోజకవర్గం కిట్టుమూరుపేట గిరిజన గ్రామాలలో పర్యటించిన ప్రత్తిపాడు వైసీపీ నాయకులు, నరసాపురం పార్లమెంటరీ పరిశీలకులు, ఎం ఎం ఆర్ చారిటబుల్ ట్రస్ట్ అధినేత మదునూరి మురళీ కృష్ణంరాజు గిరిజన గ్రామం లోని గడప గడపకు వెళ్లి అందరి యోగక్షేమాలు ఆరోగ్య పరిస్థితులు స్వయంగా అడిగి తెలుసుకుని అక్కడ నివాసితులైన గిరిజన మహిళలకు సుమారు వందమందికి పైగా సంక్రాంతి కానుకగా చీరలు పంపిణీ చేసి ప్రతి కుటుంబం ఈ సంక్రాంతి పండుగను కుటుంబాలతో ఆనందంగా జరుపుకోవాలని. మీకు ఎదురయ్యే ఏ చిన్న సమస్య అయినా నా దృష్టికి తేవాలని మీ ప్రతి కష్టంలోనూ తోడుంటానని భరోసా కల్పించారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ మేక చంటిబాబు, పెద్దపాలెం వైస్ ఎంపీపీ లొండా బాబు, దేవా లక్ష్మణ్, విత్తనాల నాగేశ్వరరావు, దేవా రామ్, ఏనుగు జాను, కొల్లుబోయిన ఏసుబాబు, వైస్ సర్పంచ్ చల్లారావు, మాజీ ఎంపీటీసీ భూముల నూకాలమ్మ, మనిటి స్వామి, కోలా తాతబాబు, బొల్లు నాగేశ్వరరావు, జువ్వల దొరబాబు, పోకనాటి వెంకటేశ్వరరావు, నాని పల్లి వెంకన్న, వైయస్సార్సీపి ముఖ్య నాయకులు అభిమానులు తదితరులు పాల్గొన్నారు.