పయనించే సూర్యుడు జనవరి 08 హుజురాబాద్ రూరల్ రిపోర్టర్ బండ శివానంద రెడ్డి అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ 44వ రాష్ట్ర మహాసభలలు 3,4,5 తేదీలలో శంషాబాద్ లో నిర్వహించారు. ఈ యొక్క రాష్ట్ర మహాసభలలో అనేక రకాల విద్యారంగ మరియు సామాజిక సమస్యల పైన తీర్మానాలు చేశారు. అనంతరం 2025-26 కి సంబంధించిన ఏబీవీపీ నూతన రాష్ట్ర కార్యవర్గాన్ని రాష్ట్ర అధ్యక్షులు రామకృష్ణ ప్రకటించారు. నూతన కార్యవర్గం లో హుజురాబాద్ చెందిన పెరుగు అభిలాష్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గాఎన్నుకోవడం జరిగినది. గతంలో కళాశాల అధ్యక్షునిగా, కళాశాల కార్యదర్శిగా, నగర సంయుక్త కార్యదర్శిగా, నగర ఉపాధ్యక్షుడిగా, హాస్టల్స్ కన్వీనర్ గా బాధ్య తలు నిర్వహించారు. ఈ సందర్భంగా పెరుగు అభిలాష్ మాట్లాడుతూ నన్ను నమ్మి రాష్ట్ర శాఖ లో స్థానం కల్పించి రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా ఎన్నుకున్న రాష్ట్ర శాఖకు ధన్యవాదాలు తెలియజేసారు. అలాగే అనునిత్యం విద్యా రంగ సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తాను అని అన్నారు.