
పయనించే సూర్యుడు జనవరి 8 అశ్వారావుపేట మండల రిపోర్టర్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట సీఎం కప్ క్రీడా పోటీలను పకడ్బందీగా నిర్వహించడం ద్వారా యువతకు మౌలిక అవకాశాలు కల్పించాలని, ప్రతి గ్రామ స్థాయి పంచాయతీ సక్రమంగా వ్యవహరిస్తే మాత్రమే ప్రభుత్వ లక్ష్యం సాధ్యమని మండల విద్యాశాఖ అధికారి పి. ప్రసాదరావు అన్నారు. అశ్వారావుపేట మండలంలోని స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో 7వ తేదీన న నిర్వహించిన సమావేశంలో అడిషనల్ పిడి, స్పెషల్ ఆఫీసర్, ఎంపీడీవో, ఎంపీఓ, ఏపీవో, సారథ్యంతో పాటు పంచాయతీ కార్యదర్శులు, టెక్నికల్ అసిస్టెంట్లు, ఫీల్డ్ అసిస్టెంట్లు, సీఆర్పీలు పాల్గొన్నారు. సమావేశంలో మండల విద్యాశాఖ అధికారి.. పి ప్రసాదరావు మాట్లాడుతూ, ఈనెల 17 నుండి 22 వరకు క్లస్టర్ వారీగా జూనియర్, సబ్-జూనియర్, సీనియర్ క్రీడాకారుల కోసం కబడ్డీ, కోకో, వాలీబాల్ పోటీలను నిర్వహిస్తామని తెలిపారు. గ్రామ స్థాయిలో యువకులను ప్రోత్సహించడమే కాకుండా, రిజిస్ట్రేషన్ ప్రక్రియను సులభతరం చేయడం, అవగాహన కల్పించడం ముఖ్యమని సూచించారు. అదనంగా, ఆట స్థలాలను గుర్తించి, పంచాయతీ కార్యదర్శులు సహాయ సహకారం అందించాలని, ఎలాంటి అవరోధాలు లేకుండా పోటీలను నిర్వీధంగా నిర్వహించడానికి పట్టణ, గ్రామీణ అధికారుల సమన్వయం అవసరమని స్పష్టం చేశారు. మండల స్థాయిలో ఈ కార్యక్రమం పంచాయతీలు, అధికారులు, ఫీల్డ్ సిబ్బందితో సహకారం కలిగితే, ప్రతీ గ్రామంలోని యువతకు క్రీడా అవకాశాలు సమానంగా లభిస్తాయని మండల విద్యాశాఖ అధికారులు పేర్కొన్నారు.