పయనించే సూర్యుడు న్యూస్ రాయికల్ మండల్ జనవరి 08 మామిడిపెల్లి లక్ష్మణ్ రాయికల్ పట్టణంలోని ఆర్ ఆర్ గార్డెన్ లో రాయికల్ జర్నలిస్టు జాయింట్ యాక్షన్ కమిటీ, ప్రెస్ క్లబ్, పోలీస్ శాఖ ఆధ్వర్యంలో మాదకద్రవ్యాల నిర్మూలపై అవగాహన సదస్సు ఘనంగా నిర్వహించారు .పోలీస్ కళాజాత బృందాల ప్రదర్శన డిజిటల్ బోర్ట్ లో పోలీస్ శాఖ వారి మినీ చిత్రం ప్రదర్శించారు.ముఖ్య అతిథిగా హాజరైన జగిత్యాల ఎస్పీ అశోక్ కుమార్ మాట్లాడుతూ విద్యార్థులు బలిష్టమైన మంచి ఆలోచన విధానంతో ఉండాలని బలహీనమైన ఆలోచన ఉంటే చెడు అలవాట్ల పట్ల ఆకర్షితులవుతారని కష్టపడి చదివిన చదువుతోపాటు మీ తల్లిదండ్రుల కష్టం వృధా అవుతుందని డ్రగ్ర్స్,గంజాయికీ బానిసైతే వారికి దేని మీద ఆసక్తి కలగదని సంగీతం కల జానపదం క్రీడలు చదువు లాంటివి దేనిపైన ఆసక్తి లేక జీవితాలు పాడైపోతాయని,విద్యార్థులకు ముఖ్యంగా ఇలాంటి చెడు అలవాట్ల పట్ల అవగాహన కల్పించడం ఎందుకంటే ఇలాంటి గంజాయి అమ్మేవారు విద్యార్థులనే టార్గెట్ చేసి విక్రయిస్తారు అని కాబట్టి ఎవరైనా డ్రగ్స్ ఇస్తా అని అంటే ప్రతి విద్యార్థి నో అని చెప్పాలి అన్నారు మంచి మిత్రులతో స్నేహం చేయాలి ఒక్కరు డ్రగ్స్ కు బానిసై మా దగ్గరికి వస్తే వారికి కౌన్సిలింగ్ ఇచ్చి రిహాలిపిటేషన్ సెంటర్ కి పంపించడం జరిగింది. అలాంటి స్థితి రాకుండా ప్రతి ఒక్క విద్యార్థి జాగ్రత్తగా వ్యవహరించాలని సూచించారు. అడిషనల్ ఎస్పీ శేషాద్రిని రెడ్డి మాట్లాడుతూ డ్రగ్స్ గంజాయి తీసుకుంటే అట్టి వాటిలో ద్వార వ్యక్తిలో టోకెమిన్ అనే పదార్థం ఎక్కువగా రిలీజ్ అవుతుంది విద్యార్థులకు మిగతా ఏ పని చేసిన అంతగా ఆ పదార్థం రిలీజ్ కాదు కేవలం డ్రగ్స్ మాదక ద్రవ్యాలు తీసుకోవడం వలన అత్యధికంగా టోకెమిన్ రిలీజ్ అయి అదే ద్వాసలో లోకి తీసుకెళ్తుంది అది అలవాటుగా మారితే వేరే ఇతర ద్యాస పనుల పట్ల స్పృహ ఉండదు అని అట్టి అలవాటు జీవితాన్ని నాశనం చేస్తుంది అని ముఖ్యంగా ఫ్రెండ్స్ తో రూమ్ లో ఉన్నప్పుడు బయటకు వెళ్ళినప్పుడు కొంచమే కదా తీసుకో అంటే అసలే డ్రగ్స్ తీసుకోకూడదు దానివల్ల జీవితమే నాశనం అవుతుందని, విద్యార్థులు చెడు అలవాట్ల పట్ల జాగ్రత్తగా ఉండాలని, ఎవరైనా సహ విద్యార్థులు ఇతరులు చెడు అలవాట్లు అలవాటు చేసుకోమని డ్రగ్స్ గంజాయి లాంటి వాటిని తీసుకోమని అడిగిన బలవంత పెట్టిన వాటిపట్ల దూరంగా ఉండి సరైన సమయంలో ఉపాధ్యాయులకు తల్లిదండ్రులకు లేదా పోలీస్ శాఖకు తెలియజేయాలని సూచించారు సత్వరమే జీవితం లో మంచి ఆశయాన్ని పెట్టుకొని నిర్ణీత వయసులోనే లైఫ్ సెటిల్ చేసుకునే లక్ష్యంతో ప్రతి ఒక్క విద్యార్థి ముందుకు సాగాలని ఆమె సూచించారు రాయికల్ జర్నలిస్ట్ జాయింట్ యాక్షన్ కమిటీ ప్రెస్ క్లబ్ అధ్యక్షులు వాసరి రవి మాట్లాడుతూ డ్రగ్స్ మాదక ద్రవ్యాలకు పాఠశాల స్థాయి విద్యార్థులు కూడ అలవాటు పడుతున్నారని పట్టణంలో శివారు ప్రాంతాలలో గంజా మరియు డ్రగ్స్ తెచ్చుకొని వాటిని విరివిగా సేవిస్తున్నారని
దృష్టి పెట్టాలని అన్నారు ప్రధాన కార్యదర్శి కడకుంట్ల జగదీశ్వర్ మాట్లాడుతూ చెడు అలవాట్ల పట్ల విద్యార్థుల దూరంగా ఉండాలని అన్నారు కోశాధికారి మచ్చ శేఖర్ ఖాళీ డబ్బా లాంటి జీవితం లో అందులో నీరు పోస్తే కొద్దిగా విలువ పెరుగుతుంది అదే పాలు పోస్తే ఇంకొంచెం విలువ పెరుగుతుంది అదే బంగారం వేస్తే అత్యధిక విలువ పెరుగుతుంది ప్రతి విద్యార్థి బంగారు భవిష్యత్తు నిర్మించుకోవడం కష్టపడి చదువుకోవాలని చెడు అలవాట్ల పట్ల దూరంగా ఉండాలని తెలిపారు తదనంతరం శాలువాతో పోలీస్ అధికారులకు మండల అధికారులకు జర్నలిస్టు జాయింట్ యాక్షన్ కమిటీ సభ్యులు సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు నాగిరెడ్డి రఘుపతి రెడ్డి చింతకుంట సాయికుమార్ సంయుక్త కార్యదర్శి గంగాధర్ సురేష్ ట్రూత్ కమిటీ సభ్యులు నాగమల శ్రీకర్ గుర్రాల వేణు సింగిడి శంకరయ్య కల్చరల్ కార్యదర్శి ఎద్దండి ముత్యంపు రాజు రెడ్డి కార్యవర్గ సభ్యులు సింగని శ్యాంసుందర్, వాసం లింబద్రి, అన్నపురం లింబాద్రిగౌడ్, ఇమ్మడి విజయ్, కళ్లెం శ్రీనివాస్, తీగుళ్ల గోపి, మామిడిపెల్లి లక్ష్మణ్, సయ్యద్ రసూల్ తదితరులు పాల్గొన్నారు