పయనించే సూర్యుడు: జనవరి 8 :హుజురాబాద్ కాన్స్టెన్సీ ఇంచార్జ్ దాసరి రవి: జాతీయ రహదారి భద్రత మాసూత్ర సందర్భంగా జాతీయ రహదారికి సంబంధించిన కారు,లారీలు,మోటార్ క్యాబ్ త్రీ వీలర్, ఫోర్ వీలర్ వాహనాల డ్రైవర్లతో రహదారి భద్రతపై బుధవారం అవగాహన సదస్సు నిర్వహించారు. నియమాలలో భాగంగా ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నియమాలు తెలుసుకొని వాటిని ప్రతి వాహనాదారుడు విధిగా పాటించిన నాడే ప్రమాదాలను నివారించవచ్చు అని హుజూరాబాద్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ కంచి వేణు అన్నారు.రోడ్లపై వాహనాలు నడిపే ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రత నియమాలు కచ్చితంగా పాటించాలని భద్రత నియమాలను పాటిస్తే రోడ్డు ప్రమాదాలను నివారించగలమని హుజురాబాద్ వాహన తనిఖీ ఇన్స్పెక్టర్ కంచి వేణు పలు సూచనలను వివరించారు.