
పయనించే సూర్యుడు, జనవరి 8 బచ్చన్నపేట మండల ప్రతినిధి: నీల పవన్. బుధవారం మండలంలోని కొడవటూరు జిల్లా పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాలలో నూతనంగా ఎన్నుకోబడిన సర్పంచ్ ఉప సర్పంచ్, గౌరవ వార్డు మెంబర్లను పాఠశాల ప్రధాన ఉపాధ్యాయురాలు రాజశ్రీ గౌరవ అధ్యక్షులు ఆధ్వర్యంలో సన్మానించారు. ఈ కార్యక్రమంలో గౌరవ సర్పంచ్ నీల కవిత మురళి, ఉప సర్పంచ్ గంగం దయాకర్ రెడ్డి మరియు వార్డు మెంబర్లు ఎం. స్వరూప, ఎం. శివకుమార్,ఎం మాధవి, డి రమ్య, ఈ బాల సిద్ధులు, ఏ నాగరాజు, ఎమ్ రవికుమార్ పి మానస, బి రమేష్. గ్రామ కార్యదర్శి రూప, చైతన్య ప్రధానోపాధ్యాయురాలు రాజశ్రీ, ఉపాధ్యాయులు అంజయ్య, శ్రీనివాస్, జి రమేష్, విజయ్ కుమార్ రాజు పాల్గొన్నారు.