నకిలీ విదేశీ మద్యం సిండికేట్‌పైభారీగా ఎక్సైజ్ దాడులు

* 139 నకిలీ మద్యం బాటిళ్ల స్వాధీనం..

పయనించే సూర్యుడు, జనవరి 8 రంగారెడ్డి జిల్లా ప్రతినిధి (ఎస్ఎంకుమార్) శంషాబాద్ పరిధిలో నకిలీ విదేశీ మద్యం తయారీ-రవాణా చేస్తున్న ముఠాపై జిల్లా టాస్క్‌ఫోర్స్, ఎక్సైజ్‌ అధికారులు సంయుక్తంగా దాడులు నిర్వహించి భారీగా నకిలీ మద్యం గచ్చిబౌలి ఇందిరా నగర్ లో స్వాధీనం చేసుకున్నా రు. విశ్వసనీయ సమాచారం మేరకు నిర్వహించిన ఈ ఆపరేషన్‌లో మొత్తం 139నకిలీ ఎఫ్‌ఎల్‌ బాటిళ్లు,136 ఖాళీ బాటిళ్లు, మద్యం తయారీలో ఉపయో గించే రసాయనాలు, లేబుళ్లు, మూతలు, ప్యాకింగ్ సామగ్రి, ఫోర్జరీకి సంబంధించిన పరికరాలతో పాటు ఒక కారు, మూడు స్కూటీ వాహనాలను స్వాధీనం చేసుకుని ఐదుగురు నింది తులను అరెస్టు చేశారు. నిందితులు గ్లెన్‌ఫిడిచ్, చివాస్ రీగల్, బ్లూ లేబుల్, విలియం లాసన్ తదితర ప్రముఖ బ్రాండ్ల పేర్లతో నకిలీ మద్యం తయారు చేసి తక్కువ ధరకు విక్రయిస్తూ ప్రజల ఆరోగ్యానికి ముప్పు కలిగిస్తున్నట్లు విచారణలో వెల్లడైంది. ఈ కేసులో నిందితులపై సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు అధికారులు తెలిపారు. తక్కువ ధరకు విదేశీ మధ్యం అంటూ బురిడీ కొట్టించే మోసగాల్ల వలలో పడకుండా మద్యం ప్రియులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. ఈ దాడులు దశరథ డి సి హెచ్ ఆదేశాల మేరకు కృష్ణప్రియ ఈఎస్ శంషాబాద్, శ్రీనివాస్ రెడ్డి ఏ ఈ ఎస్ అద్వర్యంలో డిస్ట్రిక్ట్ టాస్క్ ఫోర్స్ శంషాబాద్ టీమ్ సిఐ ప్రవీణ్ కుమార్, ఎస్ ఐ శ్రీకాంత్ రెడ్డి,స్టాఫ్ పక్రు ద్దీన్, మల్లేశ్, గణేష్, నెహ్రూ, సాయి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *