దశాబ్దాల కల నెరవేర్చిన సేవాలాల్ గుడి నిర్మాణానికి నిధులు

* గిరిజనుల హర్షాతిరేకాలు ఎమ్మెల్యే రాజేష్ రెడ్డికి కృతజ్ఞతలు

పయనించే సూర్యుడు జనవరి 8 నాగర్ కర్నూలు జిల్లా బిజినపల్లి రిపోర్టర్ కె శ్రావణ్ కుమార్ బిజినపల్లి మండల కేంద్రం: నాగర్‌కర్నూల్ నియోజకవర్గ గిరిజనుల దశాబ్దాల కల ఎట్టకేలకు సాకారమైంది. బిజినపల్లి మండల కేంద్రంలో శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ గుడి నిర్మాణానికి ప్రభుత్వం రూ.3 కోట్ల నిధులు మంజూరు చేయడంతో గిరిజన లంబాడీ ప్రజల్లో ఆనందోత్సాహాలు వెల్లివిరిశాయి. ఈ సందర్భంగా బిజినపల్లి మండల కేంద్రంలో గిరిజన లంబాడీ ప్రజాప్రతినిధులు, సర్పంచులు, ఉపసర్పంచులు, వార్డు సభ్యులు, ముఖ్య నేతలు కలిసి పాలాభిషేకం నిర్వహించి ఆనందం వ్యక్తం చేశారు. దశాబ్దాలుగా నెరవేరని ఈ కలను అసెంబ్లీలో ప్రస్తావించి, ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి నిధులు మంజూరు చేయించిన పేదల పెన్నిధి, నాగర్‌కర్నూల్ ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి గారి కృషిని వారు కొనియాడారు. ఈ సందర్భంగా గిరిజన నాయకులు మాట్లాడుతూ, గత ప్రభుత్వాల కాలంలో గిరిజనుల సమస్యలు అసెంబ్లీలో ప్రస్తావనకు కూడా రాలేదని, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన అనంతరం ప్రజా ప్రభుత్వ పాలనలో గౌరవ ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి గారి చొరవతో సేవాలాల్ గుడి నిర్మాణానికి నిధులు కేటాయించడం చారిత్రక నిర్ణయమని పేర్కొన్నారు. గిరిజనుల తరఫున ఎమ్మెల్యే గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గిరిజన లంబాడీ సర్పంచులు కేతావత్ సరోజ, మాన్య నాయక్, మునీందర్ నాయక్, మూడవత్ గోపాల్ నాయక్, గోరి భాయి, రాట్లవత్ గోపాల్ నాయక్, కృష్ణ నాయక్, కాట్రావత్ బుజ్జి, చందు లాల్ నాయక్, కేతావత్ లలిత భాయి, రాట్లవత్ విజయ్, దిప్ల నాయక్, ఇస్లావత్ పూల్య నాయక్, రామచంద్ర నాయక్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ వాల్యతో పాటు మూడవత్ గోవింద్ నాయక్, మూడవత్ హన్మ్య నాయక్, ఆంగోత్ లక్ష్మణ్ నాయక్, వి. పాండు నాయక్, బదావత్ పాండు నాయక్, పట్లవత్ పాండు నాయక్, పట్లవత్ రాజు నాయక్, దేవుల నాయక్, డెగావత్ రవి నాయక్ తదితర ముఖ్య నాయకులు, మాజీ ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *