పయనించే సూర్యుడు న్యూస్ జనవరి 8 బోధన్:గౌడ సేవా సమితి రూపోందించిన నూతన సంవత్సరం క్యాలెండరు ను బోధన్ పిఆర్టియు భవన్ లో గౌడ సేవా సమితి వ్యవస్థాపక అధ్యక్షులు పి. గంగాధర్ గౌడ్ ఆధ్వర్యంలో ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి గౌడ సామాజిక వర్గం సర్పంచ్ లు శ్రీనివాస్ గౌడ్, మంగళ్ పాడ్ రాజు గౌడ్, జైతాపూర్ ఎక్సైజ్ సిఐ భాస్కర్ రావు లు హజరై క్యాలెండరు ఆవిష్కరించారు. ఈ సందర్బంగా మంగళ్ పాడ్ సర్పంచ్ శ్రీనివాస్ గౌడ్, జైతాపూర్ సర్పంచ్ రాజు గౌడ్ లు మాట్లాడుతు బోధన్ నియోజకవర్గం లో గౌడ సేవా సమితి గౌడ సామాజిక వర్గానికి అండదండలు అందిస్తుందని పేర్కోన్నారు. 2021 నుండి అనేక సేవా కార్యక్రమాలు చేపట్టిందని తెలిపారు. గీత కార్మికులకు అండగ నిలబడిందని గుర్తు చేశారు. ఏర్గట్ల మండలం లో గౌడ కులస్తులకు జరిగిన అన్యాయం పై పోరాడిందని అన్నారు. గౌడ సేవా సమితి మరింత ఉన్నత స్థాయి కి ఎదగాలని ఆకాంక్ష ను వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం హైదరాబాద్ లో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహం ఏర్పాటు చేసినందుకు ధన్యవాదములు తెలియచేశారు. బోధన్ నియోజకవర్గం లోని అన్ని మండల కేంద్రాలలో పాపన్న గౌడ్ విగ్రహాలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. బోధన్ ఎక్సైజ్ సిఐ భాస్కర్ రావు మాట్లాడుతు గౌడ సేవా సమితి సేవా కార్యక్రమాలు నిర్వహించడం అబినందనీయం అని అన్నారు. బోధన్ గీత పారిశ్రామిక సహకార సంఘం ఆధ్వర్యంలో నీరా కేంద్రం ఏర్పాటు చేయడం హర్షించదగ్గ పరిణామం అన్నారు. గీత కార్మికులు అందరు నీరా కేంద్రాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. అనంతరం గౌడ సేవా సమితి వ్యవస్థాపక అధ్యక్షులు పి. గంగాధర్ గౌడ్ గౌడ ప్రజా ప్రతినిధులైన శ్రీనివాస్ గౌడ్, రాజు గౌడ్ లను, ఎక్సైజ్ సి ఐ భాస్కర్ రావు లను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో గౌడ సేవా సమితి రెంజల్ మండల అధ్యక్షుడు సాయిబాబా గౌడ్ నాయకులు ఎం శంకర్ గౌడ్ ఎస్ రాజా గౌడ్ చేకీ క్యాంప్ సాయ గౌడ్ కోనపూరం సాయగౌడ్ గంజ్ రమేష్ గౌడ్ వైయస్ శ్రీనివాస్ గౌడ్ పోచారం శ్రీనివాస్ గౌడ్ రాంచంధర్ గౌడ్ కల్లుగీత కార్మికులు నాయకులు పాల్గొన్నారు