తూరంగిలో గ్రామ ఆరోగ్య కేంద్రాలకు ఎమ్మెల్యే పంతం నానాజీ శంకుస్థాపన

* సూర్య నగరలో స్వాగతం పలికిన పితాని

పయనించే సూర్యుడు జనవరి 8, కాకినాడ జిల్లా కాకినాడ ప్రతినిధి కాకినాడ రూరల్ (బి వి బి) ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం ప్రజల ఆరోగ్యానికి పెద్దపీట వేస్తోందని, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో మెరుగైన వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా అడుగులు వేస్తోందని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం వెంకటేశ్వరరావు (నానాజీ) స్పష్టం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఆరోగ్య విప్లవానికి శ్రీకారం చుట్టిన ప్రభుత్వం, గ్రామీణ ప్రజల చెంతకే వైద్య సదుపాయాలను తీసుకెళ్లేందుకు భారీగా నిధులను కేటాయిస్తోందని ఆయన కొనియాడారు. కాకినాడ రూరల్ మండలం తూరంగి గ్రామంలోని సూర్య నగర్ సచివాలయం పరిధిలో, గోపికృష్ణ కాలనీ మరియు బుల్లబ్బాయి రెడ్డి నగర్‌లలో నూతన గ్రామ ఆరోగ్య కేంద్రాల నిర్మాణానికి ఎమ్మెల్యే పంతం నానాజీ భూమిపూజ చేయడం జరిగింది. 15వ ఆర్థిక సంఘం నిధులతో ఒక్కో కేంద్రానికి రూ. 36 లక్షల చొప్పున వెచ్చించి ఈ భవనాలను నిర్మించనున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నానాజీ మాట్లాడుతూ, నిరుపేదలకు నాణ్యమైన వైద్యం అందాలన్నదే ప్రభుత్వ సంకల్పమని, ఈ కేంద్రాలు అందుబాటులోకి వస్తే స్థానికులకు తక్షణ వైద్య సాయం లభిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. గతంలో పెండింగ్‌లో ఉన్న పనులన్నింటినీ పూర్తి చేస్తూ రూరల్ నియోజకవర్గాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు. శంకుస్థాపన కార్యక్రమం అనంతరం సూర్య నగర్ సచివాలయంలో రైతులకు రాజముద్రతో కూడిన 391 కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలను ఎమ్మెల్యే పంపిణీ చేశారు. రైతుల ఆత్మగౌరవాన్ని కాపాడేలా, వారి భూములకు పూర్తి భరోసా కల్పించేలా ప్రభుత్వం ఈ చర్యలు తీసుకుందని ఆయన పేర్కొన్నారు. దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న రైతులకు పారదర్శకంగా భూ హక్కులు కల్పించడం ఆనందదాయకమని, ప్రభుత్వ పథకాలన్నీ అర్హులైన ప్రతి ఒక్కరికీ అందేలా యంత్రాంగం కృషి చేస్తోందని వివరించారు. కూటమి ప్రభుత్వ హయాంలో జరుగుతున్న అభివృద్ధి పనులకు ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోందని నాయకులు అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో తూరంగి ప్రత్యేక అధికారి ఎమ్మెస్సార్ ఆంజనేయులు, పంచాయతీ కార్యదర్శి ఎస్ నాగఫణి బాబు,గ్రేడ్ 5 కార్యదర్శులు రణదేవ్, తేజస్వి, సుష్మ ,షేక్ రిజ్వి, ఇంజనీరింగ్ అసిస్టెంట్ వీరబాబు, వసంత లక్ష్మి, రోజా, దేవి,రి సర్వే డిటీ కాకర్ల సురేష్, ఆర్ఐ మేడిశెట్టి భవాని, వీఆర్వో కే .శ్రీనివాస్,డీ ఈ బి. సత్య శ్రీనివాస్ మరియు ఇంజనీరింగ్ సిబ్బంది, డాక్టర్ వసుంధర దేవి, ఏ ఎన్ ఎం డీ. మేరీ రత్నం, ఎం ఎల్ హెచ్ పి. ఐ పావని,జనసేన మాజీ ఎంపీటీసీలు పితాని వెంకట రాము, వాసంశెట్టి త్రిమూర్తులు, జనసేన గ్రామ కమిటీ ప్రెసిడెంట్ పితాని తేజ, తెలుగుదేశం గ్రామ కమిటీ ప్రెసిడెంట్ జక్కి అప్పన్న కూటమి నాయకులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *