భైంసా పట్టణంలోని ఏరియా ఆసుపత్రి లో మెరుగైన వైద్య సేవలు అందించండి ముధోల్ ఎమ్మెల్యే రామారావు పటేల్.

* ఏజెంట్ లు పెట్టి రోగులను ప్రైవేట్ ఆసుపత్రి కి తరలిస్తే ఊరుకోం * పరికరాలు ఉన్న ఉపయోగం లోకి తేవడం లేదేందుకు * బేబీ ఫీడింగ్ సెంటర్ ప్రారంభోత్సవ కార్యక్రమం లో వైద్యుల పని తీరుపై ఎమ్మెల్యే అసంతృప్తి

పయనించే సూర్యుడు నిర్మల్ జిల్లా బ్యూరో కలివెలుగుల చక్రపాణి. 09-01-2026 బైంసా ఏరియా ఆసుపత్రిలో ప్రభుత్వం అత్యధిక పరికరాలు ఇచ్చినప్పటికీ వాటికి ఉపయోగంలోకి తేవడం లేదెందుకని ఎమ్మెల్యే పవార్ రామరావ్ పటేల్ ఏరియా ఆసుపత్రి వైద్యుల పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. గురువారం బైంసా ఏరియా హాస్పిటల్ లో ఆరు లక్షల రూపాయల నిధులతో ఏర్పాటు చేసిన బేబీ ఫీడింగ్ సెంటర్ ను ప్రారంభించిన సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రభుత్వం నిధులు కేటాయిస్తున్నప్పటికీ అధికారులు వాటిని ఉపయోగించడంలో నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారన్నారు. ప్రారంభోత్సవం అనంతరం ఆయన ఆసుపత్రిలో ఎస్. ఎన్. సి యూ. ( ప్రత్యేక శిశు సంరక్షణ కేంద్రాన్ని పరిశీలించారు. అక్కడే ఉన్న జాయింట్ కలెక్టర్ తో మాట్లాడుతూ హైదరాబాదులో నిమ్స్ ఆస్పత్రి ప్రైవేట్ ఆసుపత్రికి ధీటుగా నడుస్తుందన్నారు. ఏరియా ఆసుపత్రిలో బేబీ వార్మర్ మిషన్ లు, ఐ. సి యు. సెంటర్ ఉపయోగం లోకి తేవాలని సూచించారు. కొందరు డాక్టర్ లు సొంతగా ఏజెంట్లను పెట్టి ఆస్పత్రి నుండి రోగులను తరలించడం సరికాదన్నారు. ఇకనైనా తీరు మార్చుకొని పేద ప్రజలకు వైద్య సేవలు అందించాలన్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలో బాగుండాలన్న ఉద్దేశంతో అసెంబ్లీలో మాట్లాడడం జరిగిందన్నారు. సబ్ కలెక్టర్ సాం కేత్ కుమార్ మాట్లాడుతూ త్వరలోనే వైద్యులచే సమీక్ష సమావేశం ఏర్పాటు చేసి ఆస్పత్రిని బాగుపరుస్తామన్నారు. ఎమ్మెల్యే వెంట డి సి హెచ్ ఎస్ ఏరియాస్పత్రి సూపరిడెంట్ డాక్టర్ కాశీనాథ్, వైద్యులు విజయానంద్, సీనియర్ వైద్యులు డాక్టర్ దామోదర్ రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ బి. గంగాధర్, బైంసా మండల బిజెపి అధ్యక్షురాలు దేగాం సర్పంచ్ సిరం సుష్మరెడ్డి, నాయకులు వెంగళరావు తదితరులు ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *