పయనించే సూర్యుడు న్యూస్ జనవరి 09, మంథని నియోజకవర్గ ఇంచార్జి రమేష్, మంథని మండల ప్రజా పరిషత్తు ఆవరణలో బోరు మోటారు వద్ద పైపు లీకేజీ తో నీరు వెదజిమ్ముతున్నది. దీంతో పక్కనే ఉన్న ఐసిడిఎస్ ప్రాజెక్టు కార్యాలయం ముందు నీరు నిలిచి రాకపోకలకు ఇబ్బందిగా తయారైంది. కార్యాలయ అవసరాలకు నీటి సరఫరా చేసే క్రమంలో మోటార్ వద్ద పైపు లీకేజీ కారణంగా నీరు వృధాగా పోతూ దురదమయంగా తయారవుతున్నది. సంబంధిత అధికారులు తక్షణమే మీరు వృధా పోకుండా తగిన చర్యలు తీసుకోవాలని కార్యాలయానికి వచ్చి వెళ్లే ప్రజలు కోరుతున్నారు.