మేలిగనూరులో వాల్మీకి బోయల శంఖారావం

* 40 సంవత్సరాలుగా వాల్మీకులను ఎస్టీలుగా గుర్తించాలని అలుపెరుగని పోరాటం.

పయనించే సూర్యుడు జనవరి 9 కర్నూలు జిల్లా ఇంచార్జ్ శ్రీకాంత్ కర్నూలు జిల్లా మంత్రాలయం నియోజకవర్గం కౌతాళం మండలం మేలగనూరు గ్రామంలో నది చాగి, మేలగనూరు గ్రామ వాల్మీకి నాయకులతో వాల్మీకి నాయకుల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి నది చాగి మారెన్న అధ్యక్షత వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర ఐక్య వాల్మీకి బోయ పోరాట కమిటీ రాష్ట్ర అధ్యక్షులు వాల్మీకి బి లక్ష్మన్న హాజరయ్యారు. ఈ సమావేశంలో రాష్ట్ర అధ్యక్షులు వాల్మీకి బి లక్ష్మన్న మాట్లాడుతూ ఈ కొత్త సంవత్సరము 2026లో మేలగనూరు రామలింగేశ్వర స్వామి గుడి దగ్గర వాల్మీకుల బోయల శంఖారావం సభతో పోరాటానికి నాంది పలుకుతున్నామని. ఇకనుంచి ఉద్యమాలను ఉదృతం చేస్తామని, గ్రామ గ్రామాన వాల్మీకి సభలు ఏర్పాటు చేస్తామని, ప్రతి మండల స్థాయిలో మీటింగ్లు ఏర్పాటు చేస్తామని వాల్మీకుల అందరిని చైతన్య పరుస్తామని తెలిపారు. ప్రతి నియోజకవర్గ స్థాయిలో వాల్మీకుల చైతన్య సభ లు పెడతామని వాల్మీకి బి లక్ష్మణ తెలిపారు. ఇంతకుముందే 40 సంవత్సరాలుగా ఉమ్మడి రాష్ట్రంలో కూడా రాష్ట్రవ్యాప్తంగా పర్యటనలు వాల్మీకి సింహగర్జన లు వాల్మీకి మహాసభలు,పెట్టి రాష్ట్రవ్యాప్తంగా వాల్మీకి బోయాలను ఐక్యత పరిచి చైతన్యవంతం చేయడం జరిగిందని తెలిపారు. రాష్ట్రంలోనూ కేంద్రంలోనూ ఎన్డీఏ ప్రభుత్వం ఉంది కనుక ఈసారి తప్పకుండా వాల్మీకులను ఎస్టీలుగా గుర్తిస్తారని వాల్మీకి బి లక్ష్మణ ఆశాభావం వ్యక్తం చేశారు.కానీ మన వంతు కృషి చేద్దామని త్వరలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ని, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ని కలిసి మాట్లాడదామని వాల్మీకి బి లక్ష్మన్నతెలిపారు. వాల్మీకి బోయలను ఎస్టీలుగా గుర్తించుట ఇప్పుడు కాకపోతే మరెప్పుడూ కాదని వాల్మీకి బి లక్ష్మణ జోష్యం చెప్పారు. రాష్ట్ర ఉపాధ్యక్షులు జగ్గాపురం చిన్న ఈరన్న మాట్లాడుతూ మనమందరం ఐక్యమత్యంతో ఉండి పోరాటాలకు ఉద్యమాలకు శ్రీకారం చుట్టాలని తెలిపారు. ఇప్పటినుంచి ప్రతి గ్రామం ప్రతి మండలం ప్రతి నియోజకవర్గంలో వాల్మీకి బోయల సమావేశాలు ఏర్పాటు చేస్తామని అందరూ ఐక్యమత్యంతో ముందుకు ముందుకు వచ్చి పోరాటాన్ని ఉదృతం చేద్దామని తెలిపారు. రాష్ట్ర నాయకులు లంకా రెడ్డి, నది సాగి మారన్న, నది చా గీ పకీరప్ప,కుంటనాల మారెప్ప, కాత్రికి చంద్ర, కుంభ లూరు మహాదేవ, మేలగునూరు వెంకటేశులు వాల్మికుల సభను ఉద్దేశించి మాట్లాడుతూ అందరూ కలిసికట్టుగా ఐక్యమత్యంతో పోరాడటాన్ని ఉదృతం చేద్దామని పిలుపునిచ్చారు. ఈ సభకు నది చా గీ మేలగునూరు గ్రామ వాల్మీకి బోయ నాయకులు, వాల్మీకి బోయ ప్రజలుపెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *