రాష్ట్ర ప్రభుత్వం సంచార కులాలకు కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి

* తెలంగాణ తల్లి విగ్రహానికి బీసీ నాయకులు గజ్జెల్లి వెంకటయ్య వినతి

పయనించే సూర్యుడు న్యూస్ 09-01-2026 మందమర్రి మండల రిపోర్టర్ బొద్దుల భూమయ్య మంచిర్యాల జిల్లా కేంద్రంలోని మంచిర్యాల పట్నంలోని బైపాస్ రోడ్ లో గల తెలంగాణ తల్లి విగ్రహానికి రాష్ట్ర ప్రభుత్వం సంచార కులాలకు కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ జాతీయ బీసీ హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో వినతిపత్రం ఇచ్చి నిరసన వ్యక్తం చేస్తూ నాయకులు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత బీసీలలో ఉన్న అనేక కులాలకు కార్పొరేషన్లు ఏర్పాటు చేయడం జరిగింది దాని స్వాగతిస్తూనే రాష్ట్రంలో అత్యంత వెనుక బడిన కులాలు అయిన డి ఎన్ టి లకు కార్పోరేషన్ ఏర్పాటుపై ప్రభుత్వం ఆలోచన చేయకపోవడం బాధాకరం దేశానికి స్వతంత్రం వచ్చి 79 సంవత్సరాలు అవుతున్న సంచార కులాల పరిస్థితి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉంది ఈ కులాలు విద్యా ఉద్యోగ ఆర్థిక రాజకీయ రంగాల్లో మచ్చుకైన అవకాశాలు వచ్చినా సందర్భం లేదు పొట్టకూటికోసం నానా అవస్థలతో సంచార జీవితాన్ని గడుపుతున్న కులాలకు రాష్ట్ర ప్రభుత్వం చేయూతను అందించి విద్యా ఉద్యోగ రాజకీయ రంగాలతో పాటు వాళ్ళ ఆర్థిక అభివృద్ధికి కార్పొరేషన్ ఏర్పాటు చేసి వాళ్ళ అభ్యున్నతికి రాష్ట్ర ప్రభుత్వం తోడ్పాటు అందించాలని కోరుతున్నాము లేని పక్షంలో రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని హెచ్చరిస్తున్నాం ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు గుమ్ముల శ్రీనివాస్ సంచార జాతుల సంక్షేమ సంఘం జిల్లా ఉపాధ్యక్షులు వైద్య భాస్కర్ బీసీ నాయకులు గజెల్లి వెంకటయ్య శాఖపూరి భీమ్ భీంసేన్ షలిమెల అంజయ్య రామగిరి రాజన్న చారి ధర్మాజీ మల్లేష్ వేముల అశోక్ అంకం సతీష్ పంపరి వేణుగోపాల్ తదితరు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *