చిలమత్తూరు జనవరి 9: పయనించే సూర్యుడు (ప్రతినిధి కటారి చంద్ర) చిలమత్తూరు మండలంలోని పాత చామలపల్లి గ్రామంలో కూటమి నాయకుల సహకారంతో గ్రామంలోని స్మశాన వాటిక లో వెలసిన ముళ్ల పొదలనుతొలగించారు. గురువారం గ్రామ ప్రజలు సమస్యను తెలిపిన వెంటనే సమస్య పరిష్కారానికి కూటమి నాయకులు శ్రీకారం చుట్టారు. తెలుగుదేశం పార్టీ మండల కన్వీనర్ శ్రీనివాసులు, టిడిపి సీనియర్ నాయకులు గౌరీ శంకర్ ఆధ్వర్యంలో జెసిబి సహాయంతో ముళ్ల పొదలను తొలగించారు. వీరితోపాటు స్మశాన వాటికలో పేరుకుపోయిన ముళ్ళ పొదలను తొలగించడానికి సహకారం అందించిన కూటమి నాయకులు విశ్వనాథ్ రెడ్డి, జనసేన నాయకులు చిన్న ప్రవీణ్, చంద్రమోహన్లకు గ్రామస్తులు కృతజ్ఞతలు తెలియజేశారు.