ఒకే ఒక్క ఓటుతో గెలిచినమహాత్మా నగర్ గ్రామ సర్పంచ్ పొన్నాల సంపత్ గ్రామాన్నిఅభివృద్ధిలో ముందు ఉంచుతా గ్రామపంచాయతీని జిల్లాలోనె మోడల్ గ్రామపంచాయతీగా తీర్చిదిద్దుతా

* మహాత్మానగర్ సర్పంచ్ పొన్నాల సంపత్ తో పాటు ఉపసర్పంచ్ కేతిరెడ్డి ఎల్లారెడ్డి

పయనించే సూర్యుడు జనవరి 9 కరీంనగర్ న్యూస్:మహాత్మా నగర్ గ్రామ సర్పంచ్ పొన్నాల సంపత్ మాట్లాడుతూ ఒకే ఒక్క ఓటుతో విజకేతనం సర్పంచ్ గా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే ఎస్సీ కాలనీలో దుర్వాసనతో ఉన్న డ్రైనేజీలన్నీ దగ్గరుండి శుభ్రంగా చేయించినారు మహాత్మా నగర్ గ్రామ సర్పంచ్ గా నన్ను ఒక్క ఓటుతో గెలిపించిన నా గ్రామ ప్రజలందరికీ పేరుపేరునా ధన్యవాదాలు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను మాటమీద నిలబెట్టుకుంటా గ్రామంలో ఆడపిల్ల పుడితే 5016 ఇస్తానని అన్నారు గ్రామంలో ఎవరైనా చనిపోతే నా సొంత ఖర్చులతో వైకుంఠ రథం ఏర్పాటు చేస్తానని అన్నారు నేను మహాత్మా నగర్ గ్రామపంచాయతీ సర్పంచ్ గా మా పాలకవర్గం తోటి ప్రమాణ స్వీకారం అంగ రంగ వైభవంగా చేసినాము నేను మహాత్మా నగర్ గ్రామంలో గ్రామ ప్రజలందరికీ సేవ చేయడానికి ముందుకు వచ్చినాను గ్రామంలో ఉన్న సమస్యలు సిసి రోడ్లు డ్రైనేజీలు వీధిదీపాలు గ్రామంలో రైతుల కు ఐకెపి సెంటర్ మరియు అక్కాచెల్లెళ్లకు బతుకమ్మ షూట్ ను ఏర్పాటు చేస్తానని అన్నారు గ్రామం పరిశుద్ధ కార్మికుల తోటి చెట్లు గాని డ్రైనేజీలు గాని ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచుతానని అన్నారు నూతన సిసి రోడ్లు డ్రైనేజీలు వీధిదీపాలు మంజూరు చేపిస్తానని అన్నారు గ్రామంలో అర్హులకు ఇందిరమ్మ ఇండ్లు అర్హులైన వారికి వితంతు పింఛన్లు మరియు వికలాంగుల పింఛన్లు ఇప్పిస్తానని అన్నారు గ్రామంలో 24 గంటలు అందుబాటులో నిస్వార్థ సేవకునిగా అన్న అంటే మీ ఇంటి పెద్ద కొడుకుల ప్రజల కోసం అందుబాటులో ఉంటానని అన్నారు ఈ యొక్క కార్యక్రమంలో గ్రామ ప్రజలు ఉప సర్పంచ్ వార్డు సభ్యులు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *