
పయనించే సూర్యుడు జనవరి 10 ఖమ్మం జిల్లా బ్యూరో గుగులోత్ భావుసింగ్ నాయక్ ఏన్కూరు మండలం రేపల్లెవాడ గ్రామపంచాయతీ సర్పంచ్ అజ్మీర సురేష్ నాయక్ ను స్కూల్ ఉపాధ్యాయులు సగర్వంగా ఆహ్వానించి సాలువాలతో సన్మానించడం జరిగింది. ఉపాధ్యాయులు సంతోషాన్ని తెలియజేస్తూ స్వీట్లు పంచి ఆనందాన్ని తెలియపరిచారు ఈ కార్యక్రమంలో సర్పంచ్ అజ్మీర సురేష్ నాయక్ మాట్లాడుతూ స్కూలుకు సంబంధించి ఎటువంటి సమస్యలు ఉన్న పరిష్కరించే బాధ్యత తీసుకుంటానని తెలిపారు స్కూల్ పిల్లలకు దుస్తుల పంపిణీ కూడా చేయడం జరిగింది. పిల్లలకు అక్షరాభ్యాసం చేపించడం జరిగింది. ఈ అవకాశం కల్పించినటువంటి ఉపాధ్యాయులకి కృతజ్ఞతలు తెలియజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు నిమ్మల నరేందర్ మండల యువజన అధ్యక్షులు నిమ్మల నాగేశ్వరరావు ఉపాధ్యాయులు అంగనవాడి టీచర్ సిబ్బంది గ్రామస్తులు మహిళలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు