పయనించే సూర్యుడు న్యూస్ నాంపల్లి .జనవరి 10. నాంపల్లి మండలం ముష్టిపల్లి గ్రామానికి చెందిన ముష్టిపల్లి ఎర్ర యాదయ్య తండ్రి నర్సయ్య తన వ్యవసాయ భూమి యొక్క పనుల నిమిత్తం నాంపల్లి మండల కేంద్రానికి ద్విచక్ర వాహనం పై బయలుదేరగా మార్గమధ్యలో తన వ్యవసాయ భూమికి సంభవించిన పట్టా దస్తావేజు 5492/2008. నెంబర్ ఒరిజినల్ దస్తావేజులు మార్గమధ్యలో పడిపోయాయి. ద్విచక్ర వాహనం ఆగిన తర్వాత తన దస్తావేజు కాగితాలను చూసుకున్న రైతు ముష్టిపల్లి ఎర్ర యాదయ్య లబో దిబో మని మొత్త్తుకున్నారు. రైతు ఎవరికైనా నాయొక్క దస్తావేజు కాగితాలు దొరికితే నాయొక్క పేరు ముష్టిపల్లి ఎర్ర యాదయ్య గ్రామం ముష్టిపల్లి ,మండలం నాంపల్లి ,జిల్లా నల్లగొండ నా యొక్క చిరునామాకు పంపించాలని వేడుకున్నారు.