అంగన్వాడీలకు గ్యాస్ స్టవ్ ల పంపిణీ

* పంపిణీ చేస్తున్న ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి జిల్లా కలెక్టర్ ఇల త్రిపాఠి

పయనించే సూర్యుడు న్యూస్ జనవరి 10 బోధన్ : 113 అంగన్వాడీ కేంద్రాలకు గ్యాస్ స్టవ్ లను బోధన్ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో బోధన్ దీక్షిత్ గ్యాస్ ఏజెన్సీ, యజమాని ఆదినారాయణ సహకారంతో శుక్రవారం గ్యాస్ స్టవ్ లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన ప్రభుత్వ ముఖ్య సలహాదారులు బోధన్ ఎమ్మెల్యే పి సుదర్శన్ రెడ్డి జిల్లా కలెక్టర్ ఇల త్రిపాఠి చేతుల మీదుగా అంగన్వాడి వారికి గ్యాస్ స్టవ్ లను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అంగన్వాడీల సేవలు ప్రశంసనీయమని కొనియాడారు పిల్లలకు పౌష్టికాహారం అందించేందుకు అంగన్వాడీలు ఎంతగానో తోడ్పడుతున్నాయని ఎమ్మెల్యే అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు లయన్స్ ప్రతినిధులు అంగన్వాడీ సూపర్వైజర్లు టీచర్లు ప్రజాప్రతినిధులు స్థానికులు తదితరులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *