జిల్లా స్థాయి ఇంగ్లీష్ ఒలంపియాడ్ పోటీలలో గట్లనర్సింగాపూర్ విద్యార్థుల ప్రతిభ

పయనించే సూర్యుడు జనవరి 10 ఎన్ రజినీకాంత్:- వరంగల్ లోని (నిట్ )నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ లో శుక్రవారం జరిగినటువంటి డిస్టిక్ లెవెల్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ టీచర్స్ అసోసియేషన్ ఎల్ట హనుమకొండ వారు నిర్వహించినటువంటి ఇంగ్లీష్ ఒలంపియాడ్ టెస్ట్, టెడ్ ఎడ్ స్టూడెంట్ టాక్స్ జిల్లా కాంపిటీషన్లో గట్ల నర్సింగాపూర్ విద్యార్థులు తమ ప్రతిభ చూపించారు. ఇందులో భాగంగా హనుమకొండ జిల్లాలోని జిల్లా పరిషత్ హై స్కూల్స్ , గవర్నమెంట్ హై స్కూల్స్, కేజీబీవీ హై స్కూల్స్, రెసిడెన్షియల్ స్కూల్స్ , మోడల్ స్కూల్స్ విద్యార్థులందరూ, ఉపాధ్యాయులు అందరూ పాల్గొన్నారు. స్ట్రీమ్ వన్ లోని జిల్లా పరిషత్, గవర్నమెంట్ హై స్కూల్స్ విభాగంలో హనుమకొండ జిల్లా టేడ్ ఎడ్ స్టూడెంట్ టాక్స్ విభాగంలో ప్రథమ బహుమతి సాధించినటువంటి విద్యార్థిని గడిపే ఉత్తేజిత, రాష్ట్రస్థాయి ఇంగ్లీష్ టేడ్ ఎడ్ స్టూడెంట్ టాక్స్ కాంపిటీషన్కు ఎంపికయ్యారు.జిల్లా ఇంగ్లీష్ ఒలంపియాడ్ విభాగంలో విద్యార్థిని యు. రిషిత జిల్లా లెవల్ లో ద్వితీయ బహుమతి సాధించారు. జిల్లా లేవళ్ళు ఇంగ్లీష్ స్టేట్ టాప్ కాంపిటీషన్లో బహుమతులు సాధించినటువంటి విద్యార్థినులు 10వ తరగతి చదువుతున్న గడిపే ఉత్తేజిత, ఎనిమిదో తరగతి చదువుతున్నటువంటి యు.రిషితను, ఇంగ్లీష్ ఉపాధ్యాయుడు కామారపు శ్రీనివాస్, ఉపాధ్యాయురాలు కే.అనిత ను ప్రధానోపాధ్యాయులు డోరి రమేష్, ఉపాధ్యాయ బృందం అభినందించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *