
పయనించే సూర్యుడు జనవరి 10 (జనగామ ప్రతినిధి కమ్మగాని నాగన్న) పాలకుర్తి మండల కేంద్రంలోని ప్రభుత్వ జిల్లా పరిషత్ పాఠశాలను మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ కమ్మగాని విజయ నాగన్న సందర్శించినారు శుక్రవారంవిద్యార్థినిలతో కలిసి భోజనం చేసి, భోజనంలో నాణ్యతపెంచాలని ,అదేవిధంగా మెనూ ప్రకారం విద్యార్థులకు భోజనాన్ని అందించాలని, విద్యార్థుల యొక్క ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం వివిధ రకాల కూరగాయలతో భోజనాన్ని అందిస్తుందని కాబట్టి విద్యార్థులు ఆరోగ్యంగా ఉండే విధంగా వంట మనుషులు ,అదే విధంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు కూడా బాధ్యతగా ఉండలని సూచించారు,ఈ సందర్భంగా రేపటినుండి సంక్రాంతి సెలవులు రాబోతున్నాయని విద్యార్థులు ఇంటి వద్ద పతంగులు ఎగురవేసేటప్పుడు జాగ్రత్త వహించాలని, అవి ఎగరవేసేటప్పుడు విద్యుత్ ప్రమాదాలు జరగడం ఇంటి పైకప్పుల నుండి కింద పడడం వంటివి జరిగే ప్రాణాలకే ప్రమాదం వచ్చే అవకాశం ఉంటుందని ఈ విషయాన్ని విద్యార్థుల తల్లిదండ్రులు ఎప్పటికప్పుడు పిల్లలపై నిఘా పెట్టాలని సూచించారు. అదేవిధంగా సంక్రాంతి పండుగను పిల్లలు తల్లిదండ్రులు కుటుంబ సభ్యులు అందరితో కలిసి సంతోషంగా జరుపుకోవాలని కోరుతూ విద్యార్థులకు ఉపాధ్యాయులకు అదే విధంగా విద్యార్థుల తల్లిదండ్రులకు అందరికీ కూడా సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ గాదపాక కిరణ్, వార్డు సభ్యులు కమ్మగాని శ్రీకాంత్ గౌడ్, పంచాయతీ కార్యదర్శి వెంకటాచారి, కమ్మగాని వెంకటేష్, ప్రధానోపాధ్యాయలు శోభారాణి ఉపాధ్యాయులు మల్లికార్జున రమేష్, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు
