విద్యార్థుల్లో చట్టాలపై అవగాహన బాధ్యతాయుతమైన ప్రవర్తన అవసరం

పయనించే సూర్యుడు మేజర్ న్యూస్ జనవరి 10.01.2026 మదనపల్లె అన్నమయ్య జిల్లా పుంగనూరు నియోజకవర్గం చౌడేపల్లి మండల ప్రతినిధి జె. నాగరాజ) విద్యార్థుల్లో చట్టాలపై అవగాహనతో పాటు బాధ్యతాయుతమైన ప్రవర్తన అవసరమని ఎస్సై నాగేశ్వరరావు అన్నారు అన్నమయ్య జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి ఆదేశాల మేరకు స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థులకు చట్టాలు సైబర్ ఫోక్సో కేసులపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ఎస్సై నాగేశ్వరరావు ప్రసంగిస్తూ యుక్త వయసులో ఎదురయ్యే ఆకర్షణలను నియంత్రించకపోతే భవిష్యత్తులో అనేక సమస్యలు వస్తాయన్నారు చదువు ద్వారా వ్యక్తిగతస్థాయి ఎలా పెంపొందించుకోవచ్చు మన ప్రవర్తన ఇతరులకు ఆదర్శంగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు తల్లిదండ్రులను ఆర్థిక ఇబ్బందులకు గురి చేయకుండా బాధ్యతగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు చిన్న చిన్న విషయాలకు గొడవలు పడకుండా సహనంతో వ్యవహరించాలన్నారు ఇంస్టాగ్రామ్ ఫేస్బుక్ సెల్ఫోన్ల ద్వారా జరుగుతున్న మోసాలు వాటి పట్ల అప్రమత్తంగా ఉండాల్సిన విధానం గురించి వివరించారు గంజాయి డ్రగ్స్ వంటి మత్తు పదార్థాల వల్ల జీవితాలకు కలిగే దుష్ప్రభావాలు అంతేకాకుండా మహిళలు పిల్లల భద్రత కోసం ప్రభుత్వం అందుబాటులోకి తీసుకువచ్చిన శక్తి ఉపయోగాలు అత్యవసర సహాయ నెంబర్లు 1930 112 1098 గురించి విద్యార్థులకు వివరించారు ఈ కార్యక్రమంలో మదనపల్లి శక్తి టీం సభ్యులు ముని కుమార్ నాయక్ మణికంఠ వినుకుమారి కళాశాల ప్రధానోపాధ్యాయుడు జయప్రకాష్ ఎన్ఎస్ఎస్ యూనిట్ అధికారి బాలాజీ పోలీసు సిబ్బంది పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *