పయనించే సూర్యుడు న్యూస్ జనవరి 10 అశ్వారావుపేట మండల రిపోర్టర్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బాలచెలిమి చిల్డ్రన్స్ అకాడమి హైదరాబాద్ వారు అశ్వారావుపేట జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాలకు గ్రంధాలయ నిర్వహణలో భాగంగా బాలసాహిత్యం పుస్తకాలను అందచేసారు. శుక్రవారం పాఠశాలలో జరిగిన కార్యక్రమంలో బాలచెలిమి తరపున ప్రముఖ సాహితీవేత్త సిద్ధాంతపు ప్రభాకరాచార్యులు పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు పి.హరితగారికి అందచేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పిల్లల్లో సాహితీవిలువలు పెంపొందించుటకు ఈ పుస్తకాలు ఎంతగానో ఉపకరిస్తాయని గ్రంధాలయ పిరియడ్ లోవినియోగించి పిల్లలతో చదివిస్తామని అన్నారు.తమ పాఠశాలను ఎంపిక చేసి పుస్తకాలను అందించుటకు సహకరించిన ప్రభాకరాచార్యులు , గరిపెల్లి అశోక్ బాలచెలిమి నిర్వాహకులు మణికొండ వేదకుమార్ కి ధన్యవాదాలు తెలిపారు.ఈ కార్యక్రమంలో పాఠశాల గ్రంధాలయ ఇంచార్జి పుల్లయ్య, ఉపాధ్యాయులు హరిబాబు తదితరులు పాల్గొన్నారు.